తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. బాలయ్య 107 వ సినిమా విడుదల కాకముందే 108 వ సినిమాకు సంబంధించి పూర్తి పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని అనిల్ రావు పూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు మళ్ళీ తాజాగా డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. గీతా గోవిందం సినిమా తర్వాత మహేష్ బాబుతో సర్కార్ వారి పాట సినిమా చేసిన పరుశురాం ఈ చిత్రంతో మంచి విజయాలను అందుకున్నారు.
అయితే ఈ సినిమా తర్వాత మరే హీరోతో కూడా సినిమా చేయలేదు పరశురాం. ఇప్పుడు బాలకృష్ణ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ చిత్రంలో బాలకృష్ణ సీఎంగా కనిపించబోతున్నట్లు సమాచారం. బాలయ్య పొలిటికల్ గా కూడా బాగానే ఉన్న నేపథ్యంలో రియల్ లైఫ్ లో కూడా అలాంటి పాత్ర చేస్తే ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతారని ఉద్దేశంతోనే బాలకృష్ణ సీఎంగా కనిపించబోతున్నారనే విషయం తెలియగానే అభిమానులకు సైతం ఈ సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి.
ముఖ్యంగా బాలకృష్ణ సినిమా లైనప్ తో ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు. వీరసింహారెడ్డి తర్వాత సమ్మర్లో అనిల్ రావు పూడి చిత్రాన్ని విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. డైరెక్టర్ పరశురామ్ తో చేయబోయే సినిమా 2024లో మళ్లీ సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అటు తరువాత ఆదిత్య 999 max సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలయ్య సినిమాలే కాకుండా అనుస్టాపబుల్ షో లో కూడా అదరగొట్టేస్తున్నారని చెప్పవచ్చు.