అనుపమ అంటే ఆ నిర్మాతకి ఎందుకు అంత స్పెషల్..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా అల్లు అరవింద్ మంచి పేరు సంపాదించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ తండ్రిగా మరింత పేరు సంపాదించారు. అల్లు అరవింద్ కు ముగ్గురు కొడుకులలో ఇద్దరు కొడుకులు హీరోలుగా మారారు.మరొక కోడుకు పలు వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే అల్లు అరవింద్ కు మాత్రం తన జీవితంలో ఎలాంటి లోటు లేదని తనకు కూడా ఒక కూతురు ఉంటే బాగుంటుందని ఎన్నో సందర్భాలలో తెలియజేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తాజాగా మరొకసారి 18 పేజీస్ సినిమా యొక్క పాటను విడుదల సందర్భంగా అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు పలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

Anupama Parameswaran Cute Conversation With Allu Aravind At Karthikeya 2  Success Meet - YouTube

18 పేజీస్ సినిమాలో నిఖిల్ కు జోడిగా మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. పాట విడుదల కార్యక్రమంలో అనుపమ పై అల్లు అరవింద్ ప్రశంసలు కురిపించడంతోపాటు తనకు కూతురు లేదు.. కానీ అప్పుడప్పుడు అనుపమ పరమేశ్వరన్ చూస్తే తనకు కూడ ఇలాంటి కూతురు ఉంటే బాగుంటుందనిపిస్తుందని తెలియజేయడం జరిగింది. అనుపమ మనసులో ఏది దాచుకోదు ప్రతి విషయాన్ని కూడా మొహం మీద చెప్పేస్తూ ఉంటుందని తెలియజేశారు అల్లు అరవింద్.

Anupama Parameswaran: Allu Arvind made interesting comments about Anupama..  saying that she has no acting skills.. | Producer Allu Aravind Interesting  Comments on Anupama Parameswaran telugu cinema news
మనసులో ఏది ఉంటే అదే మొహం పై కనిపించేలా అనుపమ ఉంటుందని ఆమె తీరు నాకు బాగా నచ్చుతుందని మరెన్నో విషయాలను కూడా తెలియజేస్తూ ఆమె ఒక ట్రాన్స్ పరెంట్ గా ఉంటుందని తెలియజేశారు అల్లు అరవింద్. ప్రస్తుతం అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అల్లు అరవింద్ నిర్మాతగానే కాకుండా పలు డబ్బింగ్ చిత్రాలను తెలుగులో విడుదల చేసి మంచి విజయాలను అందుకోవడమే కాకుండా లాభాలను కూడా అందుకుంటున్నారు.