విజయ్ దేవరకొండపై సెటైర్లు పేల్చిన బండ్ల గణేష్.. ఏమన్నాడంటే..

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిర్మాతగా బండ్ల గణేష్ గబ్బర్ సింగ్, టెంపర్, బాద్షా లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించాడు. ఈయన సినిమాల కంటే ఎక్కువగా కాంట్రవర్సీలతో హైలెట్ అవుతుంటాడు. కొన్నిసార్లు బండ్ల గణేష్ చేసే వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారి తీసి అతన్ని చిక్కుల్లో పడేస్తాయి. బండ్ల గణేష్‌కి నోటి దురద ఎక్కువ అని కూడా అంటారు కొంతమంది. ఇటీవలే పూరీ జగనాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ పై బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అంతే కాకుండా అల్లు అర్జున్ గురించి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇప్పుడు బండ్ల గణేష టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండని టార్గెట్ చేశాడు.

కొద్ది రోజుల క్రితం లైగర్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘మా తాత, తండ్రి ఎవరో మీకు తెలీదు, అయినా మీరంతా నాపై అంత అభిమానం చూపిస్తున్నారు’ అని కామెంట్ చేశాడు. దానికి బండ్ల గణేష్.. ‘తాతలు, తండ్రులు కాదు హీరోకి టాలెంట్ కావాలని’ అని కౌంటర్ వేశాడు. అది చాలా అన్నట్టు ఇప్పుడు మళ్లీ విజయ్ పై డైరెక్ట్ గా అటాక్ చేశాడు బండ్ల. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ట్విట్ వైరల్ గా మారింది.

ఈ ట్వీట్‌లో విజయ్, అతని తండ్రి కూర్చొని మాట్లాడుతున్న ఓ ఫొటోని, బండ్ల గణేష్ తన తండ్రికి హెయిర్ కట్ చేస్తున్న మరో ఫొటోని జోడించాడు. ఆ ఫొటోలో విజయ్ టేబుల్ మీద కాలు పెట్టి తన తండ్రితో మాట్లాడుతున్నాడు. ఈ రెండు ఫోటోలను షేర్ చేస్తూ.. ‘ మనకి ఈ ప్రపంచాన్ని చూసే అదృష్టాన్ని కల్పించిన మన తల్లిదండ్రులు మన దైవాలు వారిని ప్రేమించటం పూజించటం మన ధర్మం’ అని కామెంట్ చేశాడు. ఇది చూసి విజయ్ ని కావాలనే టార్గెట్ చేశాడు బండ్ల గణేష్ అని కామెంట్స్ పెడుతూ ఆ ట్వీట్‌ని వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.