సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోస్ ఉన్న హీరోయిన్స్ ఉన్న ఇంటర్నెట్లో మాత్రం ఓ పనిలేని బ్యాచ్ ఎప్పుడు మెగా ఫ్యామిలీ పై పడుతూ ఉంటుంది . మెగా ఫ్యామిలీ నుంచి ఏ న్యూస్ వచ్చినా సరే ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు . ఈ మధ్యనే మెగాకోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ చెప్పగానే ఆమెపై ఎన్ని లేని పోనీ రూమర్స్ ని క్రియేట్ చేసి వైరల్ చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .కొందరు సరోగసి ప్రాసెస్ అంటే ..కొందరు ఇన్నాళ్లకు ఈపిక వచ్చిందా..? అంటూ ఆమెపై చీప్ కామెంట్స్ చేశారు .
అయితే అలాంటి కామెంట్స్ ని ఏ మాత్రం పట్టించుకోని మెగా ఫ్యామిలీ ప్రస్తుతం కోడలు ప్రెగ్నెంట్ అనే న్యూస్ ని ఎంజాయ్ చేస్తుంది. కాగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కాగా ఇలాంటి క్రమంలోనే మరో హాట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన చిత్రం ధమాకా . ఈ సినిమా ట్రైలర్ నిన్ననే రిలీజ్ అయి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది, కాగా అప్పటివరకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేని ధమాకా మూవీ పై ఒక్కసారిగా భారీ అంచనాలు పెట్టుకున్నారు జనాలు . ఈ క్రమంలోనే గతంలో ఈ సినిమా కథను మెగా హీరోకి చెప్తే రిజెక్ట్ చేశాడు అన్న న్యూస్ వైరల్ గా మారింది.
త్రినాధరావు నక్కిన ఈ సినిమా కథను అనుకున్నప్పుడు మొదట మెగా హీరో అని అనుకున్నారట. అదే క్రమంలో ఆయనకు కథ కూడా చెప్పారట. అయితే కథ విన్న తర్వాత సినిమాలో పెద్ద మ్యాటర్ లేదని.. చాలా సింపుల్ గా ఉందని ..చిన్న స్టోరీ అని మెగా హీరోల స్టైల్ కి రేంజ్ కి ఆనదని రిజెక్ట్ చేశారట . దీంతో సెకండ్ ఆప్షన్ కింద రవితేజను చూస్ చేసుకున్న త్రినాధ రావు నక్కిన ..ఈ సినిమాను కసితో పవర్ ఫుల్ గా తెరకెక్కించారు . ఎంత కసిగా తెరకెక్కించారో ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది . దీంతో మెగా హీరోలకు చిన్న కథలు నచ్చవా..? పెద్దగానే ఉండాలా..? అందుకే ఆచార్య లాంటి డిజాస్టర్ సినిమాలను తమ ఖాతాలో వేసుకున్నారా..? అంటూ వల్గర్ ట్రోల్ చేస్తున్నారు జనాలు.