తెలుగు యాంకర్లలో అనసూయ వెరీ స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె గ్లామర్ కి వున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమెని మొదటిసారి చూసినవారు అనసూయకు పెళ్లయి పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా నమ్మరు. లేటు వయసులో కూడా ఘాటు అందాలతో అమ్మడు రెచ్చిపోతూ ఉంటుంది. ఆ రకంగా ఫాలోయింగ్ ఉండటం చేతనే బుల్లితెరనుంది వెండితెరపైకి షిఫ్ట్ అయింది. ఇక సినిమాల ఎంపికలో కూడా ఆమెది అందెవేసిన చేయి. చాలా సెలెక్టెడ్ రోల్స్ చేస్తూ దూసుకుపోతోంది.
హీరో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది. అప్పటినుంచి వెండితెరపై తనదైన పంథాలో సత్తా చాటుతోంది. ఓ వైపు జబర్దస్త్ యాంకర్ గా ఉంటూనే మరోవైపు వెండితెరపై కూడా రాణించడం ఆమెకే చెల్లింది. ఇక పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన పుష్ప సినిమాలో కూడా నెగిటివ్ పాత్రలో నటించి జాతీయ గుర్తింపు పొందింది. ఇక వెబ్ సిరీస్ లలో కూడా నటించి సత్తా చాటింది అనసూయ.
ఇక అసలు విషయానికొస్తే, ఓ వైపు నటిస్తూనే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ కురాళ్ళ గుండెల్లో కొలువుంటోంది. అలాగే అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అనసూయ అభిమానిపై ప్రేమ చూపించింది. తను కారులో ప్రయాణిస్తుండగా తనను నాని అనే ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియోను రీ పోస్ట్ చేస్తూ మీరు చూపించే ప్రేమకు చాలా కృతజ్ఞతలు. కానీ బైక్ మీద మీరు అలా ఛేజింగ్ చేసేటప్పుడు చాలా టెన్షన్ పడతాను. దయచేసి రిస్కు తీసుకోవద్దు అని పోస్ట్ పెట్టింది. దాంతో సో కాల్డ్ అభిమాని ఎగిరి గంతేసాడు.