టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అయితే మహేష్ బాబు కెరీర్ లో ఈ ఏడాది బ్యాడ్ ఇయ్యరని చాలామంది భావిస్తూ ఉంటారు. ఈ ఏడాది మహేష్ నటించిన సర్కారీ వారి పాట సినిమా బాగానే ఆకట్టుకున్న మహేష్ బాబు వ్యక్తిగత జీవితంలో చాలా విషాదాలు చోటు చేసుకున్నాయి. కొన్ని నెలల గ్యాప్ లోనే తల్లితండ్రులను కోల్పోవడం తో ఈ విషయం నుంచి ఎవరైనా సరే బయటపడాలంటే అంత సులువైన విషయం కాదు. దీంతో మహేష్ కు వచ్చిన కష్టాలు మరెవరికి రాకూడదని నెటిజన్లు కోరుకుంటూ ఉన్నారు.
మహేష్ జీవితంలోనే కాకుండా సినిమాలకు సంబంధించి కూడా పలు సమస్యలు ఎదురవుతున్నాయి. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎన్నో అంచనాలు మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మధ్య మధ్యలో అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. మహేష్ కెరియర్ ఎప్పుడు లేని స్థాయిలో ఈ సంవత్సరం చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. 2023 సంవత్సరమైన మహేష్ బాబుకు మంచి రోజులు రావాలని మరింత సక్సెస్ఫుల్గా తన కెరియర్ కొనసాగాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి ,త్రివిక్రమ్ సినిమాలు నటించడానికి సిద్ధంగా ఉన్నారు మహేష్ బాబు.
కృష్ణ కుమారుడు , మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు 8వ తేదీ జనవరి 2022 లో మరణించారు. ఇక కృష్ణ భార్య మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కూడా సెప్టెంబర్ 28.. 2022లో మరణించింది. నవంబర్ 15వ తేదీన 2022లో సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. ఇక ఏడాది ఈ మూడు రోజులు మహేష్ బాబు కెరీర్లు ఒక బ్యాడ్ డే గా మిగిలిపోయాయి.