గత నాలుగు ఐదు రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య కొణిదెల ఉపాసన ప్రగ్నెంట్ అని పలు మీడియా సంస్థలు ఊదరగొడుతున్నాయి. అంతేకాకుండా వారు సరోగసి (అద్దె గర్భం) ద్వారా పిల్లల్ని కనబోతున్నారని కూడా కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు కోడై కూశాయి. అయితే ఈ మధ్య కాలంలో సరోగసి పధ్ధతి ద్వారా పిల్లలను కనే హీరోయిన్స్ ఎక్కువ అయిపోవడం వలన కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత, అబద్ధమెంత అనేది చూడకుండా అలా రాయడం వలన ఎదుటివారు ఎంత బాధపెడతారో అనేది ఆలోచిచంకుండా రాయడం మాత్రం దారుణం.
ఇటివంటి తరుణంలో నిన్న ఆమె తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ, అటు తన కామినేని వంశాన్ని ఇటు తన తల్లి తరపు వారందరిని ఒక చోట చేర్చి తాను తల్లి కాబోతున్నందుకు అందరిని కలిసినట్టుగా ఒక హింట్ ఇచ్చింది. అలాగే తన అత్తయ్యని అంటే చరణ్ తల్లిని మిస్ అవుతున్నట్టు కూడా మిస్సింగ్ అత్తమ్మ అని రాసుకురావడం విశేషం. దాన్ని బట్టి చూస్తే ఆమె స్వయంగా గర్భవతి అవ్వడాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్టుగా మనకి అర్ధం అవుతుంది కదా.
ఇలాంటి సమయంలో సరోగసీ ద్వారా బిడ్డను కనే అంశానికి ఎక్కడా తావులేదు. అలాంటప్పుడు సో కాల్డ్ ఫేక్ వార్తలు ఎలా రాయగలుగుతున్నారని ఆమె తన సన్నిహితుల దగ్గర చాలా సీరియస్ అయిందని వినికిడి. అక్కడితో ఆగకుండా మీడియా వేదికగా పలు మీడియాలను ఆమె త్వరలో ఓ వార్నింగ్ ఇవ్వనుందట. కాబట్టి అబద్ధపు ఆర్టికల్స్ రాసేవారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలని ఈపాటికే అర్ధం అయ్యే ఉంటుంది.