సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్ళకి ఆషూ రెడ్డి పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలెంట్ ఉంటే ఎక్కడైనా అవకాశాలు వస్తాయి అంటూ మరోసారి తన నటనతో ప్రూవ్ చేసుకుంది . ఆషూ రెడ్డి డబ్స్మాష్ వీడియోలు ద్వారా పాపులారిటీ సంపాదించుకుని ..టిక్ టాక్ ద్వారా జూనియర్ సమంత గా ట్యాగ్ చేయించుకుంది. ఆ పేరుతోనే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. అబ్బో బిగ్ బాస్ లో ఆషూ చేసిన హంగామ అంతా ఇంతా కాదు.
బిగ్ బాస్ లో ఆమె ఆడిన ఆటకన్నా వలకబోసిన అందాలే సూపర్ సక్సెస్ అయ్యాయి . ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో హైలెట్ చేస్తున్నారు జనాలు. కాగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆషూ రెడ్డి పలు షోస్ లో మెరిసింది. అంతేకాదు సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని తన డైలీ రొటీన్ ను షేర్ చేసుకుంటూ వచ్చింది. కాగా ఈ క్రమంలోని ప్రముఖ ఛానల్ లో కామెడీ స్టార్స్ అంటూ సాగే ఓ కామెడీ షో లోను పాల్గొనింది .
ఈ మధ్య బుల్లితెరపై టిఆర్పి రేటింగ్స్ కోసం ఏదైనా చేస్తున్నారన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆషూ కమెడియన్ హరితో కూడా అలాంటి లవ్ ట్రాక్ నే నడిపించారు. వీళ్లు వేసిన స్కిట్ లో చేసిన పర్ఫామెన్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . హరి ఒక అడుగు ముందుకేసి ఆషూ నా లవర్ అని, లేచిపోయి పెళ్లి చేసుకున్నామని , ఆ తర్వాత కొద్దిసేపటికి పిల్లలు పుట్టారని కలరింగ్ ఇచ్చాడు. అంతేకాదు ఆషూ భుజంపై చేయి వేసి చేతిలో బేబీని కూడా పెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి . ఆఫ్ కోర్స్ ఇదంతా స్కిట్లో భాగమైనప్పటికీ ఆషూ పేరు కనబడితే ట్రోల్ చేసే జనాలు ఆషూ ప్రెగ్నెంట్ అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఆమెని మరింతగా దిగజారుస్తున్నారు .