బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ బాలీవుడ్ హీరోయిన్ అదితి రావ్ హైదరి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. గత కొంత కాలమ్లగా ఇద్దరూ సీక్రెట్ గా ప్రేమలో ఉన్నారని రూమర్స్ వినబడుతున్నాయి. మరోవైపు సిద్ధార్థ్ తమ ప్రేమ వ్యవహారాన్ని ఇండైరెక్ట్ గా అనౌన్స్ చేసినట్టు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మధ్య ముంబైలోని ఓ రెస్టారెంట్ వద్ద వీరిద్దరూ మీడియా కంట పడిన సంగతి విదితమే. అదిగో అప్పటి నుంచి వీరి సీక్రెట్ లవ్ పై చాలా పెద్ద ఎత్తున దుమారం రేగింది.
దీనిపై ఇంతవరకు ఈ స్టార్స్ ఇద్దరు స్పందించలేదు. కానీ హీరో సిద్ధార్థ్ పోస్ట్ చేసిన ఓ పిక్ ఈ రూమర్లకు బలాన్ని చేకూర్చేలా వుంది. విషయం ఏమంటే ఆమె పుట్టిన రోజు సందర్భంగా సిద్ధార్థ్ ప్రత్యేకంగా విష్ చేయడం. అవును, తన అఫిషియల్ ఇన్ స్టా అకౌంట్ ద్వారా ఓ లవ్లీ పిక్ ను షేర్ చేస్తూ.. తనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా, ఓ ప్రేమ కావ్యాన్ని కూడా అతను రాసుకొచ్చారు. అదేమంటే… ‘గుండెని దోచిన యువరాణి అదితి రావు హైదరీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు!’ అని.
ఇంకేముంది… దీంతో నిజంగా వీరి మధ్య లవ్ వుంది అని కొంతమంది ప్రేమ పక్షులు జోశ్యం చెబుతున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం… వీరు తమ ప్రేమని అధికారికంగా న్యూ ఇయర్ నాడు తెలుపుతున్నట్లు కూడా గుసగుసలు బయటకు వినబడుతున్నాయి. చూడాలి మరి వీరి ప్రేమ పెళ్లి దాకా వెళుతుందో లేదంటే రొమాన్స్ తో ఆగిపోతుందో. సిద్ధార్థ్ గతంలో చాలా మంది హీరోయిన్లతో డేటింగ్ చేసిన సంగతి విదితమే. శృతి హాసన్, సోహ అలీఖాన్, సమంత, హన్సిక వంటి స్టార్ హీరోయిన్లతో సిద్ధార్థ్ డేటింగ్ చేయగా తాజాగా ఈ లిస్టులో అదితి చేరింది.