అభిమానులకు గుడ్ న్యూస్ .. తండ్రి కాబోతున్న స్టార్ డైరెక్టర్..!!

స్టార్ డైరెక్టర్ అట్లీ తన అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించాడు . మనకు తెలిసిందే ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుసగా అన్ని గుడ్ న్యూస్ లో వింటూ వస్తున్నాం. స్టార్ హీరోస్ హీరోయిన్స్ ప్రేమించి తమ పార్ట్నర్స్ ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోతూ.. అంతే త్వరగా ప్రెగ్నెన్సీ విషయాని కన్ఫామ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే కాజల్ , అలియా భట్, ప్రణతి లాంటి హీరోయిన్స్ తల్లి అయ్యి మాతృత్వాని ఎంజాయ్ చేస్తున్నారు.

రీసెంట్ గా అదే లిస్ట్ లోకి వచ్చాడు స్టార్ డైరెక్టర్ అట్లీ. తన అభిమానులకు తీపి కబురు అందించారు . ఆయన తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించాడు డైరెక్టర్ .తన భార్య నటి ప్రియా ప్రేగ్నెన్సీ ని శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు . బేబీ బంప్ తో ఉన్న ప్రియ ఫోటోలను పోస్ట్ చేస్తూ అట్లీ తన అభిమానులతో ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు .

“మా కుటుంబం పెద్దది కాబోతోంది..ఈ శుభవార్తను మీతో పంచుకోవడం నాకెంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి “అంటూ రాసుకువచ్చాడు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో డైరెక్టర్ అట్లీ దంపతులకి శుభాకాంక్షలు చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్. కాగా పెళ్లైన ఎనిమిదేళ్ల తర్వాత వీళ్లిద్దరు పేరెంట్స్ కాబోతుండడంతో కోలీవుడ్ మీడియా మొత్తం ప్రియ బేబీ బంప్ పైనే ఫోకస్ పెట్టింది. మనకు తెలిసిందే ఈ డైరెక్టర్ తెర కెక్కించిన రాజా రాణి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

 

 

View this post on Instagram

 

A post shared by Priya Mohan (@priyaatlee)