సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోని పొగడడం సర్వసాధారణం . మరీ ముఖ్యంగా పేరు ఉన్న సెలబ్రిటీస్ తరచూ కొందరిని పొగుడుతూనే ఉంటారు . అవసరం ఉన్న అవసరం లేకపోయినా వాళ్లు చుట్టూ తిరుగుతూ తమ పేరుకి మరింత పాపులారిటీ దక్కించుకుంటూ ఉంటారు . అదంతా మనకు తెలిసిందే . అయితే స్టార్ హీరో సుకుమార్ సైతం ఈ మధ్యకాలంలో ఓ హీరో భజన చేస్తున్నాడు అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు .మరి ముఖ్యంగా పుష్ప సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఈ హీరో భజన ఎక్కువైంది అంటూ సుకుమార్ ని కొందరు ట్రోల్ చేస్తున్నారు .
ఆయన సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ కంటే పక్క హీరోని ఎక్కువగా పొగడడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అంతేనా పుష్ప సినిమా సుకుమార్ కెరియర్ లోని వన్ అఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాంటి ఓ హై వోల్టేజ్ పెర్ఫార్మన్స్ లో నటించిన బన్నీని పక్కనపెట్టి తెలుగులో ఇప్పుడిప్పుడే పాపులారిటీ దక్కించుకుంటున్న ఓ హీరోని సుకుమార్ ఈ రేంజ్ లో పొగడడం తో ఇండస్ట్రీలో సంచలనంగా మారింది . అంతేకాదు పుష్ప 2 సినిమా పూర్తవగానే సుకుమార్ ఆ హీరోతో సినిమాకి సిద్ధమవుతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .
దీంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ సుకుమార్ పై మండిపడే స్థాయికి ఆయన దిగజారిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి . సొంత హీరో సినిమాని ప్రమోట్ చేసుకోకుండా పక్క హీరో భజన చేస్తున్నావ్ అంటూ ఆయనపై మరిన్ని విధంగా మిరియాలు కారాలను నూరుతున్నారు. ఏది ఏమైనా సరే సుకుమార్ ఆ హీరో ని పొగడడం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అస్సలు నచ్చడం లేదని ఈ కామెంట్స్ ద్వారా అర్థమవుతున్నా ..సుకుమార్ కూడా మరి ఆ హీరో విషయంలో టూ మచ్ భజన చేస్తున్నాడని సినీ ప్రముఖులు సైతం అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఆ భజన కొంచెం తగ్గించుకొని పుష్ప2పై కాన్సన్ట్రేషన్ చేస్తే కెరియర్ బాగుపడుతుంది అంటూ సలహా ఇస్తున్నారు.