హరి హ‌ర వీర‌మ‌ల్లు.. ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తైంది 40 శాత‌మేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగ‌ర్ల‌మూడి దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప‌వ‌న్ కెరీర్ లో తెర‌కెక్కుతున్న తొలి పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రమిది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ సినిమా ప‌ట్టాలెక్కి రెండేళ్లు అయింది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు షూటింగ్ పూర్తి కాలేదు. పలు కారణాల వల్ల షూటింగ్ కు వ‌రుస అడ్డంకులు ఎదుర‌వుతూనే వ‌చ్చాయి. ఇటీవ‌లె ఈ సినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేశాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.

అదేంటంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ షూటింగ్ పూర్తైంది 40 శాత‌మేన‌ట‌. బ్యాలెన్స్ 60 శాతం పూర్తి చేయాల్సి ఉందిట. దీనికి ఏలా లేదన్నా ఆరు నెలలు సమయం పడుతుందని అంటున్నారు. అదీ ఇప్పటి నుంచి ఏకధాటిగా ప‌వ‌న్ ఎలాంటి బ్రేక్ లు తీసుకోకుండా చేస్తేనే పూర్తవుందిట. లేదంటే వ‌చ్చే ఏడాది కూడా ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డం క‌ష్ట‌మే అని అంటున్నారు.