Avatar2లో ప్లస్ లు, మైనస్ లు ఇవే… లేకుంటేనా?

ప్రపంచ సినిమా ప్రేమికులు గత 13 సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ‘అవతార్-‌2’ సినిమా ఎట్టకేలకు ఈరోజు రిలీజై కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఈపాటికే సినిమా చూసినవారు ఇంటర్నేషనల్ విజువల్ వండర్ అని తెగ ఆకాశానికెత్తేస్తున్నారు. మరికొందరు.. అంత ఏం లేదని, రొటీన్ VFX అని, యానిమేషన్ ఫిల్మ్ లా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొంతమంది ఒక్కసారైనా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని చెబుతున్నారు. అవతార్ ఫస్ట్ పార్ట్ కు ఈ సినిమాకు తేడా ఏమిటి వంటి విషయాలు ఒకసారి పరిశీలిద్దాం.

అవతార్1కి కొనసాగింపు కాబట్టి కథ సగటు సినిమా ప్రేక్షకుడికి తేలిగ్గా అర్దమవుతుంది. అయితే దర్శకుడు సినిమా సినిమాకి చాలా డిఫరెంట్ అనుభవం ప్రేక్షకుడు అందిస్తాడు. అయితే ఈ సినిమాకి వస్తే అంత డిఫరెంట్ అనే ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే అదే స్క్రీన్ప్లే, బ్యాక్ డ్రాప్ ఇక్కడ కూడా నడుస్తుంది. దాంతో సినిమా కొత్తగా అనిపించదు. అయితే ఎమోషన్స్ ఒక రేంజులో మనల్ని కట్టే పడేస్తాయి. అవతార్ 1లో కనిపించే విజువల్ ఎఫెక్ట్స్ ఇందులో కూడా కనిపిస్తాయి. కానీ కొన్ని చిన్న చిన్న మార్పులు, చేర్పులతో సినిమా ఆద్యంతం అలరిస్తుంది అని చెప్పుకోవచ్చు.

అవతార్ 2లో విశేషంగా చెప్పుకోదగ్గవి… సముద్ర గర్భంలో కనిపించే జీవులు. అవును, అన్ని రకాల జీవులు మనం అందులో వుంటాయని కూడా ఊహించలేము. గ్రాఫిక్ అయినప్ప్పటికీ మనకి ఎక్కడా ఆ ఫీలింగ్ కలగదు. గతంలో వచ్చిన సముద్ర పుత్రుడు సినిమాలో మనకి చూపించిన సముద్ర ప్రపంచం కంటే ఈ సినిమాలో మనకి కనిపించింది చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. చివరగా సినిమా ఓవరాల్ గా ఓ అద్భుతం అని చెప్పుకోక తప్పదు.