నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా వేదికగా ప్రసారమవుతున్న `అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే` టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ షో సీజన్ 1 సూపర్ హిట్ అయింది. దీంతో సీజన్ 2ను ఇటీవల ప్రారంభించారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ షోలో సందడి చేశారు.
రీసెంట్గా ప్రభాస్, గోపీచంద్ అతిథులుగా హాజరయ్యారు. త్వరలో పవన్ కళ్యాణ్ సైతం రాబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఎప్పటినుంచో నందమూరి అభిమానులు బాలయ్యను ఓ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ షోకు ఎన్టీఆర్ ను గెస్ట్ గా ఆహ్వానించమని సీజన్ 1 నుంచి అడుగుతున్నారు. బాలయ్య ఎన్టీఆర్ కాంబో ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని కామెంట్లు పెడుతున్నారు.
బాలకృష్ణ షోకు ఆహ్వానం వస్తే తారక్ నో చెప్పే ఛాన్స్ లేదు. కానీ, బాలయ్య మాత్రం ఈ దిశగా అడుగు వేయడం లేదు. ఫ్యాన్స్ రిక్వస్ట్ ను బాలయ్య పెడచెవిన పెడుతూనే వచ్చారు. ఇక సీజన్ 2 లో అయినా ఎన్టీఆర్ బాలయ్య షోలో సందడి చేస్తాడని ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ ఈసారి కూడా అభిమానులకు నిరాశ తప్పదని టాక్ నడుస్తోంది.