పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అర్జెంట్‌గా ఇద్దరు హీరోయిన్లు కావాలట. ఇటీవల ఈయన నుంచి రెండు సినిమాల అనౌన్స్మెంట్లు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో `సాహో` ఫేమ్ సుజిత్ ప్రాజెక్టు ఒకటి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇటీవల కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా బయటకు వదిలారు.
ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమా లో హీరోయిన్ కోసం సుజిత్ సెర్చ్ చేస్తున్నాడట. ఇప్పటికే కొందరు హీరోయిన్లు సంప్రదించారని కూడా తెలుస్తుంది. అలాగే మరోవైపు హరీష్ శంకర్ తో `ఉస్తాద్ భగత్ సింగ్` అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట `భవదీయుడు భగత్ సింగ్` టైటిల్ తో ఈ ప్రాజెక్టును ప్రకటించినా.. ఇటీవల టైటిల్ మార్చి కొత్త పోస్టర్ ను వదిలారు.
టైటిల్ తో పాటు కథ కూడా మారిందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించాల్సి ఉంది. కానీ ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ సినిమా కోసం మరో హీరోయిన్ ఎంపిక చేసే పనిలో పడ్డారట. మొత్తానికి ఈ రెండు సినిమాల కోసం దర్శక నిర్మాతలు ఇద్దరు హీరోయిన్లు వెతికే పనిలో పడ్డారని టాక్ నడుస్తోంది.