Avatar 2లో ఆ ఒక్క సీన్ కోసం ఏకధాటిగా 7 నిమిషాలు ఊపిరి తీసుకోవడం మానేశారట తెలుసా?

ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ విన్న ఒకే ఒక్క మాట వినబడుతోంది.. అదే Avatar 2. అవును, సినిమా ప్రేక్షకుల 13 ఏళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవతార్ 2 ఈరోజు శుక్రవారం రిలీజయింది. ప్రపంచవ్యాప్తంగా 52000 స్క్రీన్స్ లో ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలైంది. రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డుల మోత మోగించింది. గతంలో ఏ సినిమాకు లేనంతగా అవతార్ 2కు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఈ క్రమంలోనే ఇండియాలో KGF రికార్డును బ్రేక్ చేయడం విశేషం.

కాగా విడుదలకు ముందే ఈ మూవీ సోషల్ మీడియాలో లీక్ కావడం వలన ఈ మూవీకి దాదాపు 100 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అసలు విషయానికొస్తే, ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి కేట్ విన్స్ లెట్ ఈ చిత్రం షూటింగ్ లో ఓ సీన్ కోసం తాను దాదాపు 7 నిమిషాల 15 సెకన్ల పాటు ఊపిరి తీసుకోకుండా నటించాల్సి వచ్చిందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో గతంలో హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ రికార్డ్ ను బ్రేక్ చేసింది ఈ హీరోయిన్.

గతంలో మిషన్ ఇంపాజిబుల్ రోగ్ నేష్ సెట్ లో టామ్ దాదాపు 6 నిమిషాల పాటు ఊపిరి తీసుకోకుండా టామ్ నటించాడు. సాధారణంగా ఓ వ్యక్తి కేవలం రెండు నిమిషాలు మాత్రమే అలా ఉండగలడు. అలాగే నీటి అడుగున షూటింగ్ చేస్తున్నప్పుడు ఎంతో ఒత్తిడి భరించానని.. ఆ సమయంలో తాను చనిపోయానని అనుకుని గట్టిగా అరిచానని.. ఇందుకు సంబంధించిన వీడియో కూడా తన వద్ద ఉన్నట్లు చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ 2 సినిమాలో కేట్.. రోనల్ అనే పాత్రలో అలరించింది.