బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 గడిచిన గత 5 సీజన్లతో పోల్చుకుంటే TRP విషయంలో బాగా దిగజారిపోయింది. దీనికి అనేకం ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఇక్కడ చూద్దాము. ఈ సీజన్ లో పార్టిసిపెంట్స్ సెలక్షన్ ప్రధానమైన కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి హౌస్ లో అడుగుపెట్టినవారు ఒకరిద్దరు తప్ప మిగతావారు జనాలకి అంతగా తెలియదు. చంటి, రేవంత్, బాలాదిత్య ఇలా కొంతమంది మాత్రమే తెలుగు ప్రేక్షకులకి తెలిసిన ముఖాలు ఉన్నాయి. అందులో సుదీప, చంటి ఇద్దరు చాలా త్వరగా ఎలిమినేట్ అయిపోయారు. ఇక బాలాదిత్య ఉన్నా కూడా మంచివాడనే ముద్రతో గేమ్ సరిగా ఆడలేకపోయాడు.
ఇక గీతురాయల్, ఆదిరెడ్డి ఈసీజన్ లో గేమ్ ఆడటం కంటే కూడా వేరేవాళ్ల గేమ్ ని రివ్యూస్ చేయడంలో ఎక్కువగా ఇంటరెస్ట్ చూపేవారు. ముఖ్యంగా గీతు వచ్చిన కొత్తలోనే అందర్నీ టార్గెట్ చేసి మార్కులు కొట్టేయాలని చూసేది. తను అన్ ఫెయిర్ గేమ్ ఆడతానని చెప్తూ అందర్నీ కన్ఫూజన్లోకి నెట్టేసింది. దీంతో ప్రతి పార్టిసిపెంట్ కూడా సేఫ్ గేమ్ ఆడటం వలన టాస్క్ లో వచ్చే మజా, ప్లేయర్స్ నేచరల్ గేమ్ ని దెబ్బతీసిందనేది అందరికీ స్పష్టమైన విషయమే.
తద్వారా ఆడియన్స్ కి ఇంట్రస్ట్ లేకుండా పోయింది. మొదట్లో అర్జున్ కళ్యాణ్ శ్రీసత్యతో తిరగడం, ఆరోహి – సూర్య లవ్ ట్రాక్ లాంటి ఫ్రెండ్షిప్, అర్ధం పర్ధం లేని ఎపిసోడ్స్ అనేవి ఆడియన్స్ ఇంట్రస్ట్ ని గ్రాబ్ చేయలేకపోయాయి. అందరూ ఫిజికల్ గేమ్ ఆడటానికి ఇష్టపడుతున్న సమయంలో బిగ్ బాస్ ఎంటర్ టైన్మెంట్ టాస్క్ లు పెట్టేవాడు. అలాగే అందరూ ఎంటర్ టైన్ చేయడానికి ట్రై చేస్తుంటే ఫిజికల్ టాస్క్ లు పెట్టారు. ఇక నాగార్జున వీకండ్ ఒకవైపు క్లాస్ పీకుతున్నా కూడా షోకి అనుకున్న రేటింగ్ ని రాబట్టలేకపోవడం దురదృష్టకరం. అలాగే OTTలో 24 గంటల ప్రసారం కావడం అనేది కూడా షోకి పెద్ద మైనస్ అయ్యింది. దాంతో జనాలు ఈ షోని చూడటం శుద్ధదండగ, టైం వెస్ట్ అని ఒక నిర్ణయానికి రావడం పెద్ద దెబ్బే. ఇక రాబోయే సీజన్ల పరిస్థితి ఆ పరమేశుడికెరుక!