కోటు ఓకే.. మ‌రి ప్యాంట్ ఏది.. ర‌కుల్ లేటెస్ట్ ఫోటోషూట్‌పై పేలుతున్న‌ సెటైర్లు!

రకుల్ ప్రీత్ సింగ్.. గత కొంతకాలం నుంచి ఈ అమ్మడు బాలీవుడ్ లో సత్తా చాటేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఇన్నీ ఇన్నీ కావు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఈ భామ.. బాలీవుడ్ లోనూ పాగా వేయాలని చూసింది.

ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్నా సరే.. వాటిని పక్కన పెట్టి మరీ వరుసగా బాలీవుడ్లో నటించింది. అలా ఈ ఒక్క ఏడాదే ర‌కుల్ నుంచి దాదాపు అర‌డ‌జ‌న్‌ చిత్రాలు నార్త్ ప్రేక్షకులను పలకరించాయి.

కానీ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. అయినా సరే ర‌కుల్‌ ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. వచ్చే ఏడాది అయినా నార్త్‌ ప్రేక్షకులను మెప్పించి సక్సెస్ అవ్వాలని ఆరాటపడుతుంది.

ఈ సంగతి పక్కన పెడితే రకుల్ తాజా ఫోటో షూట్ నెట్టింట‌ హాట్ టాపిక్ గా మారింది. ఎప్పటికప్పుడు గ్లామరస్ పిక్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసే ఈ భామ‌.. తాజాగా మోకాళ్ళ పైకి ఉండే వైట్ కోటు, మ్యాచింగ్ ఇయ‌ర్ రింగ్స్‌, హీట్‌ ధరించి థండర్ థైస్ తో సూపర్ టెంప్టింగ్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. కుర్రాళ్లు ర‌కుల్ క్లీవేజ్ షోకు పిచ్చెక్కిపోతున్నారు. అయితే కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం కోటు ఓకే.. మ‌రి ప్యాంట్ ఏది ర‌కుల్ అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.