వాల్తేరు వీర‌య్య‌.. శ్రుతితో మెగాస్టార్ రొమాంటిక్ సాంగ్ అదిరింద‌య్యా!

మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఏడాది సంక్రాంతికి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాబీ ద‌ర్శ‌కత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించింది. అలాగే మాస్ మహారాజ రవితేజా ర‌వితేజ‌ కీలక పాత్రను పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మితం అయిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

ఈ నేపథ్యంలోనే మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లతో సినిమాపై మంచి హైప్‌ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగం గానే ఇటీవల బాస్ పార్టీ పేరుతో ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేసిన చిత్రబృంధం.. తాజాగా సెకండ్ సింగిల్ సాంగ్‌ను బయటకు వదిలారు. చిరు, శ్రుతిల‌పై చిత్రీకరించిన ఈ రొమాంటిక్ సాంగ్ అదిరిపోయింద‌నే చెప్పాలి.

సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ లోని స్విజర్లాండ్-ఇటలీ బోర్డర్ లో ఉన్న ఆల్ప్స్ మౌంటెన్ లోయలో ఈ రొమాంటిక్ ను జ‌న‌వ‌రి 12న చిత్రీక‌రించారు. మంచు పడుతున్న సమయంలో ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ పాట‌ను షూట్ చేశారు. ఈ సాంగ్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. `నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా` అంటూ సాగే ఈ మెలోడి సాంగ్ ఎంతో విన‌సొంపుగా ఉంది. దీంతో ప్ర‌స్తుతం ఈ సాంగ్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.