క్రిస్టమస్ పండుగకు టాలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద ఇద్దరు హీరోలు పోటీ పడుతున్నారు. అందులో మాస్ మహారాజా రవితేజ ఒకరు కాగా.. మరొకరు యంగ్ హీరో నిఖిల్. `కార్తికేయ 2` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నిఖిల్ `18 పేజెస్` మూవీతో పలకరించేందుకు సిద్ధం అయ్యాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అలాగే మరోవైపు రవితేజ, శ్రీలీల జంటగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో `ధమాకా` అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా కూడా డిసెంబర్ 23వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అయితే విడుదలకు ముందే రవితేజ ఓడించాడు నిఖిల్. అవును, ఇటీవల ఈ రెండు ట్రైలర్స్ బయటకు వచ్చి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. కానీ, రవితేజ ధమాకా కన్నా కూడా నిఖిల్ సినిమా ట్రైలర్ కే ఎక్కువ రీచ్ లభించింది. ధమాకా ట్రైలర్ 24 గంటల్లో 5.20 మిలియన్ వ్యూస్, 136.3కె లైక్స్ ని సొంతం చేసుకోగా.. నిఖిల్ 18 పేజెస్ సినిమా ట్రైలర్ కి 24 గంటల్లో 6.37 మిలియన్ వ్యూస్, 136.6కె లైక్స్ అందుకుంది. మరి ఈ రెండు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.