హీరో సాయికుమార్ వైఫ్ బ్యాగ్రౌండ్ తెలుసా..?

టాలీవుడ్ లో నటుడుగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ,హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడు సాయికుమార్. సాయికుమార్ తండ్రి పీజే శర్మ గారి నటన మరియు డబ్బింగ్ వారసత్వంగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.సాయికుమార్ నటించడం మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా పలు చిత్రాలను తెరకెక్కించారు. సాయికుమార్ తండ్రి ఒక పెద్ద నటుడు అయినప్పటికీ కూడా కెరియర్ మొదట్లో ఎన్నో కష్టాలను చవిచూశాడు. సాయి కుమార్ ది ఉమ్మడి కుటుంబం కావడం చేత తన తండ్రి తర్వాత ఆ బాధ్యతలని తానే చూసుకునేవారట.

Saikumar Pudipeddi Family Wife Biography Parents children's Marriage Photos

అందుచేతనే నటుడుగా కంటే ముందు ఇతర హీరోలకు వాయిస్ ఓవర్ ఇచ్చేవారు. ఆ తర్వాత నెమ్మదిగా హీరోగా విలన్ గా పలు చిత్రాలలో నటించారు. సాయికుమార్ భార్య సురేఖ కూడా తనకి అన్ని విధాల తోడు ఉంటుందని పలు సందర్భాలలో తెలియజేశారు. సాయికుమార్ తమ్ముళ్ల బాధ్యతలను సాయికుమార్ భార్య సురేఖ అనే చాలా పాత్ర వహిస్తూ ఉండేదట. ముఖ్యంగా సంపాదించిన మొత్తాన్ని ఆమె చేతిలో పెట్టేవారట సాయికుమార్ తో పాటు అతని తమ్ముళ్లు కూడా. అలా వారికి కావలసిన అంత డబ్బును వాడుకొని ఆ తర్వాత సేవ్ చేసుకునే వారట.

సాయి కుమార్ కు సురేఖకు ఆది సాయికుమార్ జన్మించారు. ఆదికి తన సొంత తమ్ముడు కూతురితో వివాహం జరిపించింది సురేఖ. సురేఖ ఒక పెద్దింటి కోడలు అన్న గర్వం కూడా ఉండదట. కేవలం సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా అందరిని పలకరిస్తూ ఉంటుందట.అంతేకాకుండా ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా బాగానే ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటుందట .ఇక కొన్ని సందర్భాలలో సాయికుమార్ సినిమాలు ఆగిపోయే సమయంలో దాసరి నారాయణ గారితో మాట్లాడి తన సినిమాలను విడుదల చేయించిందట. అలా సినీ ఇండస్ట్రీలో చాలా మంచిగా వ్యవహరిస్తూ సాయికుమార్ కుటుంబాన్ని ముందుకు తీసుకు వచ్చింది.