అయ్య బాబోయ్..కన్నడ బ్యూటీ రష్మిక అంతకు తెగించిందా..?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే. చెప్పే కొద్ది ఇంకా ఏదో మిగిలే ఉంది అన్న ఫీలింగ్ ఉంటుంది . వినే వాళ్ళకి ఇంకా కొంచెం చెప్తే బాగుండు అన్న ఫీలింగ్ మరింతగా ఉంటుంది . అంతలా తన నటనతో అందంతో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఛలో అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా.. ఆ తర్వాత ఎవరు ఊహించిన విధంగా బిగ్ స్టార్స్ సినిమాలో అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరిపోయింది .

ఇక ఆ తర్వాత నేషనల్ క్రష్ గా ట్యాగ్ అందుకొని హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. పుష్ప సినిమాతో ఆమె పేరుని ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో మారు మ్రోగిపోయేలా చేసుకుంది. అయితే గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో ఆమె పేరు ఏ రేంజ్ లో ట్రోల్ అవుతుందో తెలిసిందే . ఓ డైరెక్టర్ విషయంలో మిస్ అండర్ స్టాండింగ్స్ వచ్చిన రష్మిక మందన్నా.. ప్రజెంట్ కన్నడ ఇండస్ట్రీలో బ్యాన్ అయ్యే పోజీషన్ లో ఉంది. అయితే వాటిని ఏమాత్రం లెక్కచేయని నేషనల్ క్రష్ రష్మిక మందన టాలీవుడ్ లో తన పేరుని మరింత చెప్పుకునేలా చేసుకోవాలని డిసైడ్ అయింది .

ఈ క్రమంలోనే మహేష్ బాబుతో కలిసి ఐటమ్ సాంగ్ లో చిందులు వేయడానికి డిసైడ్ అయ్యింది. అంతేకాదు ఈ సాంగ్ లో ఏకంగా లంగా జాకెట్ వేసుకొని రెచ్చిపోయి మాస్ స్టెప్స్ వేసే విధంగా సిద్ధపడినట్లు సమాచారం అందుతుంది. అంతేకాదు పుష్ప సినిమాలో సమంత – అల్లు అర్జున్ ధైస్ పై ఎక్కి స్టెప్స్ వేసినట్లు గానే.. మహేష్ బాబు థైస్ పై రష్మిక కూర్చోని స్టెప్స్ చేసే విధంగా సాంగ్ కొరియోగ్రఫీ చేయబోతున్నారట . ఏది ఏమైనా సరే అంత పెద్ద స్టార్ హీరోయిన్ ఇలాంటి మాస్ బీట్ కి మాస్ స్టెప్స్ వేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . రష్మిక తన పేరుకి మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకోవడానికి ఇలాంటి సాహసం చేస్తుంది అంటున్నారు కొందరు నెటిజన్స్ . చూడాలి మరి రష్మిక తీసుకున్న నిర్ణయం ఆమెకు ఏమేరా సక్సెస్ ఇస్తుందో..?