శంకర్ సినిమా కోసం రామ్ చరణ్ ఎంత తీసుకుంటున్నారో తెలుసా..కెరీర్ లోనే హైయెస్ట్ రికార్డ్..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మెగాస్టార్ వన్ అండ్ ఓన్లీ వారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ..చిరుత సినిమాతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు . ఇక తర్వాత మగధీరతో ఇండస్ట్రీ లెక్కలను తిరగ రాశాడు . ఈ సినిమా హిట్ అవ్వడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోయింది . అంతేకాదు అప్పటివరకు చిరంజీవి కొడుకు అని చెప్పుకునే రామ్ చరణ్ ని.. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ అంటూ చెప్పడం స్టార్ట్ చేశారు .

 

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు తన కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది . డిఫరెంట్ రోల్స్ ని చూస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు రాంచరణ్ . రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ ని తన ఖాతాలో వేసుకున్న రామ్ చరణ్.. ప్రజెంట్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో ఆర్సి15 అనే సినిమాను చేస్తున్నాడు . ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మూడో షెడ్యూల్ సైతం కంప్లీట్ చేసుకోనుంది.

ఈ క్రమంలోనే ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది . ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్.. ఈ సినిమా కోసం ఏకంగా దాదాపు 100 కోట్లను కోట్ చేసి తీసుకుంటున్నాడట . నిర్మాత దిల్ రాజు సైతం ఈ విషయంలో రామ్ చరణ్ అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తున్నాడని టాక్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఇప్పటివరకు ప్రభాస్ మాత్రమే 100 కోట్లు తీసుకొని ఇండస్ట్రి లో రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పుడు బన్నీ సైతం పుష్ప 2 కోసం 100 కోట్లు తీసుకుంటున్నాడు అన్న టాక్ వినిపిస్తుంది. ఇదే క్రమంలో రాంచరణ్ కూడా తన సినిమా కోసం 100 కోట్లు కోట్ చేశాడు అని వార్తలు రావడం సంచలనం గా మారింది. ఏది ఏమైనా సరే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకొని ఉన్నారు మెగా అభిమానులు . చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో చరణ్ కి మంచి పేరు తీసుకొస్తుందో..?