మల్లెమాల మరో బిగ్ సర్ ప్రైజ్.. మళ్లీ జబర్ధస్త్ లోకి రోజా..ఇప్పుడు అసలు మజా అంటే..!!

బుల్లితెరపై జబర్దస్త్ షోకి ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బుల్లితెర చరిత్రలోనే ఫస్ట్ టైం కామెడీ షో ని ఈ విధంగా ప్లాన్ చేసి స్కిట్స్ తో కమెడియన్స్ కు లైఫ్ ఇచ్చిన షోగా జబర్దస్త్ బాగా పాపులారిటీ సంపాదించుకుంది . ఎంతోమంది టాలెంట్ ఉన్న కమెడియన్స్ రోడ్డుపైన అల్లాడిపోతున్న టైంలో వాళ్లకి పిలిచి అవకాశమిచ్చిన జబర్దస్త్ .. ప్రజెంట్ 500 ఎపిసోడ్ ని కంప్లీట్ చేసుకున్నింది.

జబర్దస్త్ 500 ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా జబర్దస్త్ ఒకప్పటి జడ్జీ రోజా మళ్లీ మెరిసింది. దీంతో జబర్దస్త్ 500 ఎపిసోడ్ కి సంబంధించిన స్పెషల్ ప్రోమో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే జబర్దస్త్ షో స్టార్టింగ్ నుంచి జడ్జిలుగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రోజా , సీనియర్ హీరో నాగబాబు వ్యవహరించారు . అయితే కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ నుంచి నాగబాబు తప్పుకున్నారు..ఆ తర్వాత కొన్ని నెలలకే రోజా మినిస్టర్ పదవి రావడంతో పూర్తి ఫోకస్ ని ప్రజలపై పెట్టాలని జబర్దస్త్ నుండి తప్పుకుంది .

దీంతో టిఆర్పి రేటింగ్స్ కొంచెం కొంచెం గా డౌన్ అయింది . జబర్దస్త్ లో కమెడీయన్స్ చేసిన స్కిట్స్ లో భాగంగా రోజా టంగ్ స్లిప్ అవుతూ బూతు పదాలను దొర్లేది.. కొన్ని కొన్ని సార్లు హద్దులు మీరి పంచెస్ వేసి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఇవన్నీ జబర్దస్త్ షోకి బాగా ప్లస్ గా నిలిచాయి. దీంతో రోజా షో నుంచి తప్పుకున్న తర్వాత జబర్దస్త్ టి ఆర్ పి రేటింగ్ కూసింత తగ్గిందనే చెప్పాలి.

మళ్లీ ఆమె రీ ఎంట్రీ ఇస్తూ ఎపిసోడ్ ని పైకి లేపింది . జబర్దస్త్ షో గురించి మాట్లాడుతూ ..” నాతో పాటు వచ్చిన హీరోయిన్స్ ఫెడవుట్ అయిపోయారు . నా పేరు ఇంకా జనాలు గుర్తుపెట్టుకున్నారు అంటే దానికి ఒకే ఒక్క కారణం జబర్దస్త్” అంటూ ఓ రేంజ్ లో పొగిడేసింది . ప్రస్తుతం రోజా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు రోజా ఇలా నెల కి ఓ ఎపిసోడ్ కి వచ్చినా టీఆర్పీ రేటింగ్స్ ఈ రేంజీ లో పెరిగిపోతాయి అని అంటూ రోజా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి జబర్దస్త్ లో రోజా ఈ ఒక్క ఎపిసోడ్ కి గెస్ట్ గా ఉందా ..? లేదా మిగతా ఎపిసోడ్ కూడా గెస్ట్ గా కంటిన్యూ అవుతుందా..? ప్రజెంట్ ఈ 500 ఎపిసోడ్ ప్రోమో వైరల్ గా మారింది.