USA ప్రీమియర్ బుకింగ్స్ లో దుమ్మురేపిన వాల్తేరు వీరయ్య..!

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో అదిరిపోయే రీయంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత కూడా వరుస‌ సినిమాలు చేసుకుంటూ వెళుతున్న చిరంజీవి ఈ క్రమంలోనే గత సంవత్సరం వచ్చిన ఆచార్య సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత మలయాళం సూపర్ హిట్ సినిమా లూసిఫర్ ను తెలుగులో రీమేక్ చేసి గాడ్ ఫాదర్ గా తెరకెక్కించగా అందులో చిరంజీవి హీరోగా నటించి మళ్లీ అదిరిపోయే హిట్‌ను అందుకున్నాడు.

Waltair Veerayya: యూట్యూబ్ లో దుమ్ము రేపుతున్న “వాల్తేరు వీరయ్య” టీజర్..!! | NewsOrbit

ఆ సినిమా తర్వాత ప్రస్తుతం చిరు యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న పక్క మాస్ యాక్షన్ సినిమా వాల్తేరు వీరయ్య. ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ కూడా ఇక ఈ సినిమా నుంచి అప్డేట్లతో మెగా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తుంది.

Waltair Veerayya Fourth Song Poonakaalu Loading On December 30th | Clapnumber

ఈ సినిమాలో చిరంజీవికి జంటగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. మాస్ మహారాజా రవితేజ కూడా ఈ సినిమాలో అదిరిపోయే ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా నిన్నటి నుంచి ఈ సినిమా ప్రీమియర్ బుకింగ్స్ కూడా మొదలవగా..ఇక వాల్తేరు వీరయ్య USA ప్రీమియర్ షో బుకింగ్స్ ఈ విధంగా ఉన్నాయి… వాల్తేరు వీరయ్య – 29 లొకేషన్స్ – 62 షోస్-టోటల్ గ్రాస్ : $17,640.