నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం 2021లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఇటు వెండితెరపై అటు బుల్లితెరపై కూడా బాలకృష్ణ ఆదరగొడుతున్నాడు. ఆహాలో వస్తున్న అన్ స్టాపబుల్ షో తో యువతలో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు.
ఇప్పటికే తొలి సీజన్ ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా పేరు తెచ్చుకోగా.. ఇక ఇప్పుడు తాజాగా ప్రసారం అవుతున్న రెండో సీజన్ కూడా అదిరిపోయే రీతిలో అదరగొడుతుంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇక తాజాగా నిన్న రాత్రి 7ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ అయింది. ఏడో ఎపిసోడ్ కు బాలయ్యతో పాన్ ఇండియా హీరో ప్రభాస్ మరియు యాక్షన్ హీరో గోపీచంద్ అతిథులుగా వచ్చారు.బాలకృష్ణ ప్రస్తుతం తన 107వ సినిమాను కూడా మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీర సింహారెడ్డిలో నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. ఈ సంక్రాంతి కనుగా జనవరివరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా యూనిట్ ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ చాలా కాలం తర్వాత తనకి కలిసి వచ్చిన ఫ్యాక్షన్ పాత్రలో కనిపించడంతో నందమూరి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానులను మరింత ఊరిస్తూ ఈ సినిమాకు సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తున్నారు.
దీంతోపాటు బాలయ్య అభిమానులు కూడా తామేమి తక్కువేం కాదన్నట్టు వారు కూడా ఫ్యాన్ మేడ్ పోస్టర్లను రెడీ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇక రీసెంట్‌గా ఈ మూవీ ప్రొడ్యూసర్స్ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ మేకింగ్ స్టిల్ ని రిలీజ్ చేయగా అందులో బాలయ్య కళ్లద్దాలు పట్టుకుని మాస్ లుక్ లో యమ బీభత్సం చేశాడు.
ఇప్పుడు ఆ ఫోటోని నందమూరి అభిమానులు సూపర్బ్ గా ఎడిట్ చేసి.. గాడ్ ఆఫ్ మోసెస్ అనే ట్యాగ్ లైన్ ని ఆ పోస్టర్‌లో పెట్టి స్టైలిష్ ఫాంట్ లో గాడ్ ఆఫ్ మాసెస్ కనిపించే విధంగా బాలయ్య మాస్ గా ఉన్నాడు. అయితే ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్‌ని వీర సింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా షేర్ చేశాడు. ఆ పోస్టర్ చూస్తుంటే బాలయ్య అభిమానులకి కాదు ప్రతి ఒక్కరికి పూనకాలు వచ్చే విధంగా అందులో బాలయ్య కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టెంటా హల్చల్ చేస్తుంది.