కరాటే కళ్యాణి:ఆ సినిమా వల్లే ఒక వేశ్యగా చూస్తున్నారు..!!

టాలీవుడ్ లో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. అందులో కరాటే కళ్యాణి కూడ ఒకరు. ఈమె ఎక్కువ సినిమాలు చేసినప్పటికీ అంతగా ఈమెకి గుర్తింపురాలేదు. దాదాపు కరాటే కళ్యాణి 25 సినిమాలలో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కేవలం 2 సినిమాలలో గుర్తుపట్టేలా చేసుకుంది. కృష్ణ, మిరపకాయ్, వంటి సినిమాలలో నటించి గుర్తింపు సంపాదించుకుందన్ని చెప్ప వచ్చు. కృష్ణ మూవీలో తన మేనరిజం చూపించి. ఆ సినిమాలో బాబీ… అంటూ..ఇక మిరపకాయ సినిమాలో అబ్బా… పిండేసారు అనే డైలాగుతో ఈమె పాపులర్ అయ్యింది.

Ravi Teja And Karate Kalyani Funny Comedy Scenes | Latest Telugu Comedy  Scenes | TFC Comedy - YouTube

ఇదిలా ఉండగా తన వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డానని తన భర్తతో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది కరాటే కళ్యాణి. రాను రాను ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయని బిగ్ బాస్ 4 లోకి ఎంట్రీ ఇచ్చి వార్తల్లో నిలిచింది. తరువాత మా ఎలక్షన్స్ టైంలో కూడా ఎక్కువ వార్తల్లో నిలిచింది. ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో తనకు గుర్తింపు తెచ్చిన పాత్రల వల్ల తనపై వ్యభిచారిని అనే ముద్ర పడిందంటూ కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్లను చేసింది.

Krishna Movie Please GIF - Krishna Movie Please - Discover & Share GIFs

నేను బతుకుతెరువు కోసం సినిమాల్లోకి వెళితే నాకు ఈ బిరుదు ఇచ్చారని కన్నీరు పెట్టుకుంది. నాకు వచ్చిన ఏ సినిమా అవకాశాలను నేను వదులుకోలేదు. చెప్పాలంటే ఎక్కువమంది నన్ను బాబీ.. అనే డైలాగుతోనే గుర్తుపడతారు. కానీ అందరూ అనుకున్నట్టు నేను అలాంటి దాన్ని కాదు నాలో మరో కోణం కూడా ఉంది. నేను చాలామందికి హెల్ప్ చేశాను. వారందరూ నన్ను ఎంతగానో గౌరవిస్తారు. ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా సింగర్, డాన్స్ ,యాంకరింగ్ ఇలా అన్నిటిలో చేశానని తెలుపుతుంది.

నా బతుకు తెరువు కోసం నాకు వచ్చినవన్నీ చేశాను. ఆ రెండు సినిమాల్లో చేసిన ఆ డైలాగుల ప్రభావం కారణంగా నాకు వ్యభిచారి అని ముద్ర వేశారు.. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉండడంతో చాలా బాధనిపిస్తోందని తెలియజేస్తోంది.మీరు పెట్టే కామెంట్స్ కి నేను చాలా బాధపడుతున్నానని తెలియజేస్తోంది.