ఆహా బాక్స్ బద్దలు కొట్టిన ప్రభాస్- బాలయ్య.. దెబ్బకు సర్వర్లు మటాష్..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఇప్పటికే తొలి సీజన్ ను కంప్లీట్ చేసుకుని రెండో సీజన్‌లో కూడా అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో సినీ సెలబ్రిటీస్ తో పాటు రాజకీయ నాయకులతో కూడా బాలయ్య మామూలు రచ్చ చేయడం లేదు.. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకున్న ఈ సీజన్లో.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏడో ఎపిసోడ్ కూడా నిన్న రాత్రి ఆహాలో స్ట్రీమింగ్ అయింది. ఇక ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణతో సందడి చేయడానికి పాన్ ఇండియా హీరో ప్రభాస్ మరియు మ్యాచో స్టార్ గోపీచంద్ గెస్ట్‌లుగా వచ్చారు.

Prabhas Unstoppable With NBK Episode On New Year's Eve

 

అయితే నిన్న రాత్రి 9 గంటలకు ఈ ఎపిసోడ్ ఆహలో స్ట్రీమింగ్ అయింది. ఈ బాహుబలి ఎపిసోడ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఒకేసారి ఆహా యాప్ ని లాగిన్ అయ్యేసరికి ఒక్కసారిగా ఆహా సర్వర్లు మొత్తం డౌన్ అయిపోయాయి. ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయినప్పటి నుంచి అహ సర్వర్లు స్లో అవుతూనే ఉన్నాయి.

Unstoppable with NBK Season 2: Nandamuri Balakrishna asks Prabhas about  marriage, link-ups | Entertainment News,The Indian Express

అయితే మరికొందరు ఈ ఎపిసోడ్‌ను థియేటర్లో స్క్రీనింగ్ చేసి ఉంటే మరింత ఎంజాయ్ చేసే వాళ్ళమని అన్న వాళ్లు కూడా లేకపోలేదు.ఈ ఎపిసోడ్ కు ముందు నుంచే భారీ హైప్ రావడంతో.. దీంతోపాటు ప్రోమోలు కూడా మరింత ఆసక్తిని రేపటం, అందులోనూ బాలయ్య ఎనర్జీ ఎవరు ఇప్పటిదాకా అడిగే సాహసం చేయని ప్రశ్నలను ఆయన టచ్ చేయటం సగటు సినీ ప్రక్షలలో కూడా మరింత ఎక్సైట్మెంట్ కు కారణమైంది.

Nandamuri Balakrishna Sweet Conversation WIth Prabhas in Unstoppable With  NBK Season 2

ఇక్కడే కాదు యుఎస్ తదితర దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని నెటిజెన్ల నుంచి వస్తున్న రిపోర్ట్. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులకు లేదా స్టార్ హీరో నటించిన వరల్డ్ ప్రీమియర్ కు తప్ప ఇలా జరగడం అరుదు. అందులోనూ ఇప్పుడిప్పుడే సర్వర్ కెపాసిటీ మీద దృష్టి పెట్టి 4కెకు అప్ గ్రేడ్ అయిన ఆహాకు ఇలాంటి ఇబ్బందులు మున్ముందు సమస్యలు రాకుండా ఉపయోగపడతాయి. దీనికే ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు ముందస్తు ప్రిపరేషన్ చాలా అవసరం అయ్యేలా ఉంది. కేవలం షూటింగ్ కే మీడియాలో ఓ రేంజ్ రచ్చ జరిగింది.