నిత్యం సినిమావాళ్ళ మీద జ్యోతిష్యం చెప్పే వేణు స్వామి గురించి ఇంచుమించుగా మన తెలుగు రాష్ట్రాలలో అందరికీ తెలిసినదే. ఇదివరకే రెబల్ స్టార్ ప్రభాస్ పై ఎన్నో రకాల వ్యాఖ్యలు చేసిన ఈ స్వామిజీ తాజాగా అతని ఆరోగ్య విషయమై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే, 2023 కూడా రెబల్ స్టార్ ప్రభాస్ కు అంతగా కలిసి రాదని, మరీ ముఖ్యంగా వచ్చే ఏడాది నుంచి ప్రభాస్ ఆరోగ్యం చాలా దారుణంగా ఉంటుందని అన్నారు. విషయం ఏమిటని అడిగితే రాశుల ప్రస్తావన తీసుకువచ్చారు ఓ మీడియాద్వారా.
ఆయా వ్యాఖ్యలు రెబల్స్ కి కాస్త బాధ కలిగించినా ఈ మాటలు నగ్న సత్యాలని, నమ్మి మసలుకుంటే మంచిదని మన డార్లింగ్ కి సూచన చేసారు. ఇకపోతే ప్రభాస్ ది జాతకరీత్యా వృశ్చికరాశి. కావున ప్రస్తుతానికి శని గురువు స్థానాలు మారడంతో ఆయనకు పలు ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని వేణు స్వామి పలికారు. అలాగే ఆయన అర్థాష్టమ శని, ఒకవైపు అష్టమ గురువు, ఒకవైపు షష్ఠమ గురువు మరోవైపు ఉండడంతో ఆయన అనేక సమస్యలను ఎదుర్కోబోతున్నారంటూ వేణు స్వామి సదరు మీడియా ముఖంగా మాట్లాడారు.
అయితే ఆయన వ్యాఖ్యలు కాస్త కఠినంగానే వున్నా ఒకింత ఆలోచించాల్సిన అవసరం ఉండాలి కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కొంతకాలంగా ప్రభాస్ ని చూస్తేనే అర్ధం అవుతుంది. మునుపటి ముఖ వర్చస్సు ఆయనలో ఇపుడు కనబడటం లేదు. ఇక అతని ఆరోగ్యం కూడా సరిగా లేదని తెలుస్తోంది. ఇంకా ఆయన మాట్లాడుతూ ప్రభాస్ జాతకాలను అస్సలు నమ్మరే నమ్మరని, అలా జాతకాలను నమ్మకుండా చేసిన రాధేశ్యామ్ సినిమా కూడా డిజాస్టర్ అయ్యిందని చెప్పుకొచ్చారు. కాగా ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
2023లో ప్రభాస్ పరిస్థితి ఇదే… వేణుస్వామి జ్యోతిష్యం ఇదే!
