బ్లాక్లో పవన్ ఖుషి మూవీ టికెట్లు.. ఎంతో తెలిస్తే మతులు పోవాల్సిందే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే.. పవన్ కు హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్నారు.ఆయన కెరీర్‌లో ఖుషి సినిమా ఎంతో సంచలన విజయం సాధించి టాలీవుడ్ లోనే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమాను కోలీవుడ్ దర్శకుడు ఎస్ జె సూర్య తెరకెక్కించగా పవన్ కు జంటగా భూమికా నటించింది.ఈ సినిమా సక్సెస్ తో భూమిక టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. సింపుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా యువతను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా న్యూ ఇయర్ కానుకగా మళ్లీ రీ రిలీజ్ కాబోతుంది.

Sale > kushi telugu cinema > in stock

డిసెంబర్ 31వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా బుకింగ్ విషయంలో కూడా ఫస్ట్ రిలీజ్ సినిమాల టికెట్లన్నీ హాట్ కేక్స్ లా అమ్ముడు పోతున్నాయి. దీంతో ఈ సినిమా టికెట్లు దొరకటం కూడా కష్టమవుతుందని తెలుస్తుంది. ఇక దీంతో ఈ సినిమా ఎర్లీ మార్నింగ్ షోలు కోసం బ్లాక్ లో ఈ సినిమా టికెట్లను కొనడానికి ప్రయత్నిస్తున్నారు. బ్లాక్ లో ఈ సినిమా టికెట్లు ధరలు చూస్తే వెయ్యి రూపాయల నుంచి రూ.1500 వరకు ధరలు నడుస్తున్నట్లు సమాచారం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డు స్థాయిలో రీరిలీజ్ అవుతున్న ఖుషి సినిమాకి టికెట్లు దొరకటం లేదంటే ఇక పవన్ కళ్యాణ్ మేనియా ఎంతలా ఉందో మనకు అర్థమవుతుంది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఖుషి సినిమాకు ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో వారి ఆనందానికి అవధులు లేవు. మరి కొద్ది గంటల్లో ఖుషి సినిమా ధియేటర్‌లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కలెక్షన్ లో కూడా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియ‌లంటే మరి కొద్ది గంటలు వేచి చూడాల్సిందే.