బాలయ్య షోలో కనిపించని సెలబ్రిటీస్ వీళ్లే..!

నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లోనే తొలిసారిగా ఓ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా చేసి తనలోని కొత్త బాలయ్యను అభిమానులకు పరిచయం చేశాడు. ఆ షోలో బాలయ్యను చూసిన ప్రతి ఒక్కరూ మన బాలకృష్ణ ఏనా అనే విధంగా ప్రతి ఒక్కరిని అదరగొట్టాడు. ప్రస్తుతం ఆహలో వస్తున్న ఆన్ స్టాపబుల్ షో ఇప్పటికే తొలి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్లో అడుగుపెట్టింది. ఈ సీజన్లో కూడా బాలకృష్ణ అదిరిపోయే రీతిలో అదరగొడుతున్నాడు.

Unstoppable 2 with NBK S2: Episode 6 Guest: Jayasudha, Jayaprada, and  Raashi Khanna to stream on Aha Telugu on December 23 - MySmartPrice

తొలి సీజన్లో టాలీవుడ్ లో ఉన్న పలువురు స్టార్‌ సెలబ్రిటీలను బాలయ్య ఇంటర్వ్యూ చేయగా.. రెండో సీజన్లో కూడా సినీ సెలబ్రిటీస్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ షోలో సందడి చేశారు.ఇప్పటికే ఈ సీజన్ 6 ఎపిసోడ్ కంప్లీట్ చేసుకున్న ఈ షో నిన్న‌ రాత్రి తో ఏడో ఎపిసోడ్ కూడా ఆహలో స్ట్రీమింగ్ అవ్వగా ఆ ఎపిసోడ్ కి పాన్ ఇండియా హీరో ప్రభాస్ యాక్షన్ హీరో గోపీచంద్ గెస్టులుగా వచ్చారు.

ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన టాలీవుడ్ అభిమానులు ఒక్కసారిగా ఆహా లో లాగిన్ అయ్యే స‌రికి సర్వర్లు మొత్తం డౌన్ అయిపోయాయి.. తర్వాత వచ్చే మరో ఎపిసోడ్ కోసం కూడా బాలయ్య మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ఆ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ మొదలవగా.. షూటింగ్లో బాలకృష్ణ- పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ను ఈ సీజన్ ఎండింగ్ ఎపిసోడ్ గా స్ట్రీమింగ్ చేయబోతున్నారని తెలుస్తుంది.

Nandamuri Balakrishna's Remuneration For Unstoppable With NBK Revealed! -  Filmibeat

ఈ రెండు సీజన్ లో కూడా హాజరుకాని సెలబ్రిటీల జాబితా కూడా ఎక్కువగానే ఉంది. అయితే అన్ స్టాపబుల్ షో సీజన్ 3 కూడా ఉండబోతుందనే సమాచారం కూడా అందుతుంది. మొదటి రెండు సీజన్లకు హాజరుకాని అయిదుగురు క్రేజీ సెలబ్రిటీలను ఈ మూడో సీజన్ లో కనిపించే అవకాశం ఉందట. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ ఐదుగురు హీరోలను బాలయ్య షోలో చూడాలంటే మరో ఏడాది ఆకాల్సిందే అంటూ కామెంట్లు కూడా వస్తున్నాయి.

అన్ స్టాపబుల్ సీజన్ 3 తో టాలీవుడ్ లో ఉన్న అందరూ సెలబ్రిటీలు కూడా బాలయ్య షోలో సందడి చేసినట్టు అవుతుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఆన్ స్టాపెబుల్ మూడవ సీజను పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ సీజన్లో టాలీవుడ్ ప్రముఖులతో పాటు ఇతర భాషలలో స్టార్ హీరోలుగా ఉన్నవారు కూడా బాలయ్య షోలో సందడి చేయబోతున్నారట. అన్ స్టాపబుల్ సీజన్ 3 గురించి త్వరలోనే అధికార ప్రకటన ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.