చెప్పుతో కొట్టాడా..? కొట్టించుకున్నాడా..? పవన్ డైరెక్టర్ కి నోటి దూల ఎక్కువే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు టైం ఎలా మారిపోతుందో ఎవరికీ తెలియదు . స్టార్ హీరోగా ఉన్న సెలబ్రిటీ జీరో అవ్వడం.. ఎటువంటి ఫామ్ లేకుండా ఫెడ్ అవుట్ అయిపోయిన హీరో మళ్ళీ స్టార్ గా మారడం.. రాత్రికి రాత్రి జరిగిపోతూ ఉంటుంది . అలాగే మాస్ మహారాజా రవితేజ కెరీర్ లోను అలాంటి ఒడిదుడుకులు ఎన్నో ఎదుర్కొన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్గా సినీ కెరియర్ని ప్రారంభించిన రవితేజ .. తర్వాత కమెడియన్ ఆ తర్వాత హీరోగా ..ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలకి చమటలు పట్టించే మాస్ హీరోగా మారిపోయాడు .

కాగా గత కొంతకాలం నుంచి మాస్ మహారాజు రవితేజ టైం బాగోలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ సినిమా పట్టుకున్న డిజాస్టర్ గా మారుతూ వచ్చింది. ఈ క్రమంలోని ఆయనతో సినిమా చేయడానికి భయపడ్డారు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లు. రీసెంట్ గా త్రినాధ్ రావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కిన ధమాకా మాత్రం అలాంటి కామెంట్స్ ను తుడిచి పెట్టేలా చేసింది . రిలీజ్ అయిన ఆరు రోజులకే దాదాపు 56 కోట్లు కలెక్ట్ చేసి సంచలన రికార్డులు క్రియేట్ చేసింది . ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా నటించి..సినిమాకి మరో ప్లస్ అయింది .

 

కాగా ఈ సినిమా ఇంత సక్సెస్ కావడంతో రీసెంట్గా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు చిత్ర బృందం . ఈ క్రమంలోనే సక్సెస్ మీట్ కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన పవన్ కళ్యాణ్ ..లక్కీ డైరెక్టర్ హరిష్ శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . హరిష్ శంకర్ – రవితేజకు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హరిష్ శంకర్ షాక్ సినిమాతో డిజాస్టర్ ని అందుకుంటే ..ఆ తర్వాత సినిమా మిరపకాయ్ తో హిట్ ఇచ్చాదు రవితేజ .

ఈ క్రమంలోని హరిష్ శంకర్ కి రవితేజ అంటే స్పెషల్ గౌరవం ఉంది . ఈ గౌరవాన్ని స్టేజిపై చూపిస్తూ ఆయన కాళ్లు మొక్కి నమస్కారం చేశాడు. “అంతేకాదు ఇప్పటివరకు రవితేజను చాలా మంది ట్రోల్ చేశారని ఆయనకు ఇండస్ట్రీకి పనికిరారు అని కామెంట్స్ చేశారని అలాంటి వాళ్లకు ధమాకా సినిమాతో చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చాడని హరిష్ శంకర్ చెప్పుకొచ్చాడు.” ఈ క్రమంలోనే ఇన్నాళ్లు రవితేజ గురించి ఎటువంటి కామెంట్స్ చేయని హరీష్ శంకర్ ధమాకా సినిమా హిట్ అవ్వగానే రవితేజ గుర్తొచ్చాడా..? అంటూ రవితేజ ఫాన్స్ ఆయనపై మండిపడుతున్నాడు .

దీంతో కొందరు ట్రోలర్స్ రవితేజ అలాంటి వాళ్లను చెప్పుతో కొట్టాడో లేదో తెలియదు కానీ.. నువ్వు అలాంటి కామెంట్స్ చేసి రవితేజ ఫ్యాన్స్ దగ్గర మాత్రం చెప్పుతో కొట్టించుకునేలానే ఉన్నావు ..అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో భూతద్దంలో పెట్టి చూస్తున్నారు జనాలు.