ఈమధ్య నందమూరి బాలకృష్ణ టైం బావుంది. ఓవైపు వెండితెరను ఏలుతూనే మరోవైపు బుల్లితెరపై కూడా దుమ్ము దులుపుతున్నారు. అల్లు వారి OTT వేదిక అయినటువంటి ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి వస్తున్న ప్రజాదరణ అంతాఇంతాకాదు. దీనికి బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి సీజన్ సూపర్ డూపర్ హిట్ అవడంతో తాజాగా సెకండ్ సీజన్ ప్రారంభమైంది. తొలి ఎపిసోడ్‌కి అతిథిగా మాజీ సీఎం చంద్రబాబు రాగా ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నింటిని ఆ ఎపిసోడ్ తిరగరాసింది. ఫస్ట్ సీజన్ రికార్డులను సైతం బ్రేక్ చేసింది. దాంతో ఆహా ఓటీటీకి సబ్‌స్కైబర్లు కూడా దండిగా పెరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోబోయేది ఏమంటే తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు ఈ షోతో. ఈ నేపథ్యంలో బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‌కి బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటుకున్నారట. ఎందుకంటే బిగ్ బాస్ 5 సీజన్లతో పోలీస్తే ఈ సీజన్ చప్పగా సాగుతోంది. దీంతో వచ్చే సీజన్‌కి మరింత పాపులారిటీ రావాలంటే బాలయ్య రావాలని ఫ్యాన్సే కాదు అంతా భావిస్తున్నారు. మరి దానికి బాలయ్య ఒప్పుకుంటాడా లేదో అన్న విషయం తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇకపోతే బిగ్ బాస్‌లో ఇప్పటివరకు ఎన్టీఆర్, నాని తర్వాత నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తూ వున్నారు. ఇపుడు ప్రజలు బాలయ్య స్టైల్ హోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ స్టైల్ చేయాలంటే ఒక్క నందమూరి అందగాడు బాలయ్యకే సాధ్యం. అయితే గత సీజన్లతో పోలీస్తే ప్రస్తుత సీజన్ పూర్తిగా తేలిపోవడంతో బాలయ్య రావాలని అప్పుడే బిగ్ బాస్ తెలుగుకు మరింత పాపులారిటీ వస్తుందని సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతోంది. అన్‌స్టాపబుల్ షోకు వస్తున్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని బాలయ్య అయితేనే హోస్ట్‌గా బాగుంటుందని అంతా భావిస్తుండగా దీనిపై నిర్వాహకులు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.
బిగ్ బాస్ షో అభిమానులకు శుభవార్త… హోస్ట్‌గా బాలయ్య?
