హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె నాగ చైతన్య నుండి విడిపోయి సంవత్సరం అయింది. జీవితం గడ్డు పరిస్థితులలో వున్నపుడే మంచి మంచి సినిమాలలో నటించి పేరు తెచ్చుకుంది. ఎంతలా అంటే ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో సామ్ పేరు మారుమ్రోగిపోతోంది. మరోవైపు అనారోగ్య సమస్యలు కూడా ఆమెని వెంటాడుతున్నాయి. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా సామ్ తన సత్తాని చాటుతుంది. తాజాగా మరోసారి తన సత్తాని చాటింది. ఇండియా వైడ్‌గా తానేంటో నిరూపించుకుంది. సమంత ఇటీవల `యశోద` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది.
లేడీ ఓరియెంటెడ్‌గా చిత్రంగా, సరోగసి నేపథ్యంలో సాగే ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకున్నట్టు సినిమా కలెక్షన్లే చెబుతున్నాయి. ఈ సినిమా ఇప్పటికి దాదాపు 35కోట్లు వసూలు చేసి బ్రేక్ ఈవెన్ అయ్యిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం లాభాల బాటలో రన్ అవుతుంది. ఓ వైపు భర్తతో విడిపోయి, మరోవైపు అనారోగ్యంతో పోరాడుతూ సమంత చేసిన ఈ చిత్రం ఘన విజయం సాధించడం, కలెక్షన్ల పరంగానూ అదరగొడుతున్న నేపథ్యంలో సమంత స్టామినాకి అద్దం పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం సామ్ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా తన మార్కెట్‌ని చాటుకుంది.
యశోద సినిమా కోసం సమంత చాలా శ్రమించింది. ప్రత్యేకమైన ట్రైనర్ల ద్వారా శిక్షణ తీసుకుందట. అంతగా కష్టపడటం వల్లే సినిమాలో యాక్షన్‌తో అదరగొట్టిందని అంటోంది చిత్ర యూనిట్ ఓ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. తాజాగా ఇండియా వైడ్‌గా ఆమె నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. `ఓర్మాక్స్ మీడియా` ప్రకటించిన జాబితాలో ఆమె మొదటి స్థానంలో నిలవడం కొసమెరుపు. మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ జాబితాలో సమంత ఫస్ట్ ప్లేస్‌ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత అలియాభట్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది.