గ‌రికపాటి వ‌ర్సెస్ చిరు.. ఇంత పొలిటిక‌ల్ యాంగిల్ ఉందా…!

ప్రముఖ అవ‌ధాని.. ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత గ‌రికపాటి న‌ర‌సింహారావుకు.. మెగాస్టార్‌..చిరంజీవికి మ‌ధ్య ఎలాంటి వివాదం లేక‌పోయినా.. ఇప్పుడు సోష‌ల్ మీడియాను మాత్రం ఈ విష‌యం తీవ్ర స్థాయిలో కుదిపే స్తోంది. వాస్త‌వానికి..ఇది పెద్ద వివాదం కాద‌నేది.. ఇరు ప‌క్షాల వాద‌న‌. అటు చిరు అభిమాన వ‌ర్గం అయినా ..(కొంద‌రు ర‌గ‌డ చేస్తున్నారు), ఇటు గ‌రిక‌పాటి వ‌ర్గ‌మైనా.. దీనిని బూత‌ద్దంలో చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు.

Garikapati Vs Chiru Takes Caste Turn! - Movie News

కానీ, గ‌రిక‌పాటి వ‌ర్సెస్ చిరు మ‌ధ్య నెల‌కొన్న వివాదం.. మాత్రం ఇప్ప‌టికే రికార్డు సృష్టించింది. “అస‌లు ఏం జ‌రిగింది? చిరును గ‌రిక పాటి ఏమ‌న్నారు?“ అనే విష‌యంపై గ‌త వారంలో రికార్డు స్థాయిలో గూగుల్ లో సెర్చ్ చేసిన అంశం ఇదే. అంతేకాదు.. యూట్యూబ్‌లోనూ.. తెగ వెతికేసిన విష‌యం కూడా ఇదే.. ఒక్క ఇండియాలోనే కాదు.. దేశ‌, విదేశాల్లోని.. అనేక మంది పౌరులు.. ఏంటీ గ‌రిక పాటి వివాదం అని నెట్‌లో త‌ల‌పెట్టేసి.. మ‌రీ సెర్చ్ ఇంజ‌న్ను చుట్టేశారు.

మీరు సెల్ఫీలు ఆపితేనే ప్రసంగిస్తా.. చిరు (Chiranjeevi Konidela)పై గరికపాటి (Garikipati Narasimha Rao) అసహనం

ఇంత‌కీ ఈ వివాదం ఏంటి? ఎందుకు అన్ని మ‌లుపులు తిరిగింది? అనే విష‌యం ఆస‌క్తిగా మారింది. హ‌రియాణ గ‌వ‌ర్న‌ర్‌.. బీజేపీ నాయ‌కుడు.. బండారు ద‌త్తాత్రేయ ఏటా.. అల‌య్‌-బ‌ల‌య్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఈ ఏడాది నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి తొలిసారి చిరు, గ‌రిక‌పాటిల‌ను ఆహ్వానించారు. అయితే… కార్య‌క్ర‌మంలో చిరును చూసిన ఆయ‌న అభిమానులు సెల్ఫీలు తీసుకోవ‌డం ప్రారంభించారు.

Garmi Garikipati

ఇంత‌లోనే త‌న ప్ర‌సంగం మొద‌లు పెట్టేందుకు స‌మ‌యం మించిపోవ‌డంతో గ‌రిక‌పాటి.. వారు.. చిరంజీవిగారు మీ ఫొటో సెష‌న్ ఆపేసి రావాలి! అని గ‌ద్దించారు. అయితే.. ఇది వివాదానికి దారితీసింది. ఛ‌స్ చిరు లాంటి వ్య‌క్తిని.. మెగా హీరోను గ‌ద్దిస్తావంటావా.. ? అని ప్ర‌శ్నిస్తూ.. చాలా మంది గ‌రిక‌పాటిపై వివాదం లేవ‌నెత్తారు. ఈ విష‌యంలో జోక్యం చేసుకున్న మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు.. మ‌రింత ర‌క్తిక‌ట్టించే ప్ర‌య‌త్న చేస్తున్నారు.

Garikapati vs Mega Fans, Garikapati vs Chiranjeevi.. What happened.. Why is there still a fight? – tweet

ఇంత‌లోనే ఈ విష‌యంలో వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ జోక్యం చేసుకున్నాడు.. ఇలా మొత్తం ఎపిసోడ్ వెనుక‌.. పొలిటిక‌ల్ యాంగిల్ ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. రాజ‌కీయంగా చిరు ప్రాధాన్యం పెర‌గాల‌ని.. భావిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న‌ను గ‌ద్దించ‌డం ఏంట‌నేది ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చిన విష‌యం. అయితే.. ఇది ఏమేర‌కు స‌క్సెస్ అవుతుంద‌నేది కూడా ప్ర‌శ్నే. చూడాలి ఏం జ‌రుగుతుందో.