టీడీపీ స‌వాల్‌ను స్వీక‌రిస్తారా… జ‌గ‌న్ కు పెద్ద ప‌రీక్షే..!

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే.. ఈ స‌మావేశాల‌ను ఐదు రోజుల‌కే ప‌రిమితం చేసి నా.. ప్ర‌భుత్వ వ్యూహం మాత్రం మ‌రోలా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో మ‌రోసారి.. రాజ ధాని అమ‌రావ‌తి గురించిన చ‌ర్చ ప్రారంభ‌మైంది. ఒక‌వైపు రైతులు పాద‌యాత్రను తిరిగి ప్రారంభించారు. అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు ఈ యాత్ర సాగ‌నుంది. అయితే.. దీనిని త‌మ‌పై చేస్తున్న దండ యాత్ర‌గా వైసీపీ ఉత్త‌రాంధ్ర ప్ర‌జాప్ర‌తినిధులు ఆరోపించారు.

AP Assembly : ఏపీ అసెంబ్లీలో ఏం జరిగింది ? - 10TV Telugu

అంతేకాదు.. మూడు రాజ‌ధానుల‌ను ఎవ‌రూ క‌ట్ట‌డి చేయ‌లేర‌ని కూడా వైసీపీ నేత‌లు మ‌రోసారి చెప్పుకొ చ్చారు. ఈ క్ర‌మంలో టీడీపీ చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు.. మీకు మూడు రాజ‌ధానులు కావాలంటే.. అదే అజెండాతో ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి.. ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని స‌వాల్ విసిరారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు జ‌రుగుతున్న అసెంబ్లీలో మ‌రోసారి మూడు రాజ‌ధానుల బిల్లును జ‌గ‌న్ ప్ర‌వేశ పెట్టే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

కొన్నాళ్ల కింద‌ట‌.. రాష్ట్ర హైకోర్టు విచార‌ణ సంద‌ర్భంగా.. ఈ మూడు రాజ‌ధానుల‌పై 2020లో తీసుకువ‌చ్చిన బిల్లు స‌హా.. సీఆర్ డీఏ ర‌ద్దు బిల్లును.. ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకుంది. అయితే.. అప్ప‌ట్లోనే మ‌రింత బ‌లంగా.. ఈ బిల్లులు తీసుకువ‌స్తామ‌ని చెప్పారు. ఇప్పుడు ఈ ఉద్దేశంతో నే ప్ర‌స్తుత స‌మావేశాల‌ను పెడుతున్నార‌నేది ప‌రీశీల‌కుల అంచ‌నా.. వైసీపీ వ‌ర్గాలు కూడా లోపాయికారీగా ఇదే అంశాన్ని చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో స‌భ‌లో ఈ బిల్లులు పెట్టి ఆమోదించుకున్నాక‌.. జ‌గ‌న్ స‌ర్కారును ర‌ద్దు చేసే అవ‌కాశం లేక‌పోలేద‌ని ఒక అంచ‌నా.

what is cm jagan action plan on high court judgement over amaravathi as  capital details, , andrapradesh,

ఎందుకంటే.. మూడు రాజ‌ధానుల అంశాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లి.. ప్రాంతీయ అభివృద్ది అంశాన్ని ర‌గిలించి.. త‌ద్వారా.. త‌ను మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకునే ఆలోచ‌న చేసినా.. చేయొచ్చ‌నేది ప‌రిశీల‌కులు వేస్తున్న అంచ‌నాగా ఉంది. ఇప్ప‌టి వ‌రకు జ‌రిగిన జ‌గ‌న్ పాల‌న‌ను చూస్తే.. ఆయ‌న చేయాల‌నుకున్న‌ది చేయ‌డ‌మే త‌ప్ప‌.. వెన‌క్కి త‌గ్గిన ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ అనూహ్య నిర్ణ‌యం తీసుకుని.. చంద్ర‌బాబు స‌వాల్ మేర‌కు స‌ర్కారును ర‌ద్దు చేస్తారా? లేక .. ఏం చేస్తారు? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.