కంటెంట్ లేక బోల్తా పడిన సినిమాలు OTT రిలీజ్‌కు రెడీ అయిపోతున్నాయి!

కరోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత సినిమా రంగానికి గడ్డు పరిస్థితులు తలెత్తాయని స్పష్టమౌతోంది. ఈ క్రమంలో థియేట్రికల్ మార్కెట్ కంటే, OTT మార్కెట్ గణనీయంగా పెరగడం కూడా చిత్ర పరిశ్రమపై గొడ్డలిపెట్టులాగా మారింది. దీంతో రెగ్యులర్ సినీ ప్రేమికులు, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా OTTల వైపే మొగ్గు చూపుతున్నారు. కొన్ని సినిమాల‌కు థియేట‌ర్ దాకా వెల్లే బ‌జ్ క్రియేట్ కాక‌పొవ‌డంతో.. బాక్సాఫాస్ వద్ద అవి ఫ్లాప్ లుగా నిలిచిపోతున్నాయి. అయితే.. గ‌త నెల‌లో రిలీజ్ అయిన సినిమాల్లో కొన్ని పర్వాలేదనిపిస్తే, మ‌రికొన్ని నిరాశ ప‌రిచాయి. అలా డీలాప‌డ్డ సినామాల‌న్నీ ఓటీటీ బాట‌ప‌ట్టాయి.

ఇందులో మొదటిది “పక్కా కమర్షియల్” మూవీ. ఈ సినిమాకి భారీ ప్రచారం జ‌రిగిన‌ప్ప‌టికీ.. ప్రేక్షకులు, విమర్శకుల నుండి అంత‌గా ఆద‌ర‌ణ లభించలేదు. దీంతో ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అలాగే లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో మత్తు వదలారా ఫేమ్ దర్శకుడు రితేష్ రానా తెర‌కెక్కించిన సినిమా “హ్యాపీ బర్త్ డే”. ఈ మూవీ కూడా అంత‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక పోయింది. దీని తరువాత రామ్ పోతినేని “ది వారియర్” రొటీన్ కథ, స్క్రీన్‌ప్లే కార‌ణంగా ఈ కాప్-డ్రామా ఫెయిల్యూర్ కి దారితీసింది. ఇక ఈ మూవీ డిస్నీప్ల‌స్‌హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో ఆగస్టు 11న రిలీజ్ కాబోతోంది.

ఇక నాగ చైతన్య – విక్రమ్ కుమార్ కాంబోలో వచ్చిన సినిమా “థాంక్యూ”. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద అడ్డంగా బోల్తాప‌డింది. వ‌సూళ్లు లేక క్రాష్ అయ్యింది. ఇకపోతే ఈ సినిమా డిజిటల్‌ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. కాగా ఆగస్టు 20వ తేదీన‌ ఓటీటీలో విడుదలకు సిద్ధం అవుతోంది. గ‌త జులై లో రిలీజ్ అయిన సినిమాల్లో ర‌వితేజ హీరోగా వచ్చిన‌ “రామారావు ఆన్ డ్యూటీ” కూడా మెప్పించలేకపోయింది. కాగా, ఈ మూవీ కూడా త్వరలో OTTలోకి వచ్చే చాన్స్ వుంది. ఆగస్టులో Sony Liv యాప్‌లో ప్రసారం చేయాలని ప్లాన్ చేస్తున్న‌ట్టు సినీ వ‌ర్గాల స‌మాచారం.