బాబు భ్రమలు..ఆ జిల్లాల్లో వీక్?

అదిగో జగన్ పై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది..జగన్ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు చీదిరించుకుంటున్నారు. అసలు జగన్ కు ప్రజలు ఇంకో అవకాశం ఇవ్వరని, రాబోయేది టీడీపీ ప్రభుత్వమని, ఇంకా వార్ వన్ సైడ్ అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు పదేపదే చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఏ మీటింగ్ లో చూసిన బాబు ఇలాగే మాట్లాడుతున్నారు.

అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ప్రజలు…జగన్ ని చిత్తుగా ఓడించడానికి రెడీగా ఉన్నారన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇవన్నీ బాబు భ్రమలే అని చెప్పొచ్చు. అయితే రాజకీయంగా తమ పార్టీ శ్రేణుల్లో ఊపు తీసుకురావడానికి బాబు అలా మాట్లాడటంలో తప్పు లేదు..కానీ వాస్తవ పరిస్తితులు ఆ పార్టీ కార్యకర్తలకే తెలుసు. ఎందుకంటే జగన్ బలం తగ్గిందనే మాట వాస్తవమే. కానీ అది అధికారం పోయేంత కాదని అందరికీ అర్ధమవుతుంది.

గత ఎన్నికల్లో భారీ విజయం వచ్చింది..దాంతో పోలిస్తే ఇప్పుడు జగన్ బలం కాస్త తగ్గింది…అది కూడా కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరగడం వల్ల..కానీ అధికారం మారిపోయే స్థాయిలో బలబలాలు మారలేదని చెప్పొచ్చు. ఇప్పటికీ ప్రజల్లో జగన్ కు ఆదరణ ఉంది. జగన్ సంగతి పక్కన పెడితే..అసలు అధికారంలోకి వచ్చేంత బలం టీడీపీకి వచ్చిందట…ఇంకా రాలేదనే చెప్పొచ్చు. ఏదో కొన్ని జిల్లాల్లో వైసీపీకి ధీటుగా టీడీపీ బలపడిన మాట వాస్తవమే కానీ…కొన్ని జిల్లాల్లో టీడీపీ బలం పెద్దగా పెరగలేదు.

ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో పావు వంతు కూడా టీడీపీ బలం పెరగలేదు. కొద్దో గొప్పో అనంతపురంలో వైసీపీకి పోటీగా వచ్చింది. ఇక నెల్లూరులో టీడీపీ బలం శూన్యం. ప్రకాశంలో వైసీపీకి పోటీగానే వచ్చింది. ఇటు వస్తే విజయనగరం జిల్లాల్లో కూడా టీడీపీ బలం పెరగలేదు. అయితే నెక్స్ట్ జనసేనతో గాని కలిస్తే విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు లాంటి జిల్లాల్లో టీడీపీకి కాస్త ఛాన్స్ ఉంటుంది…లేదనుకుంటే వైసీపీకే లీడింగ్ ఉంటుంది. కాబట్టి బలం పెరిగిపోయిందని బాబు భ్రమల్లో ఉండటం వల్ల ఉపయోగం లేదు.