రెడ్లు రిపీట్..మళ్ళీ నిలబెడతారా?

అధికార వైసీపీ ఎమ్మెల్యేలని సీఎం జగన్ మాటలు బాగా టెన్షన్ పెడుతున్నాయని చెప్పొచ్చు…నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరికి సీటు ఇస్తారో…ఇవ్వరో అనే టెన్షన్ నేతల్లో ఎక్కువ ఉంది. ఇప్పటికే పలుమార్లు జగన్..ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు…ఇటీవల కూడా వర్క్ షాప్ లో జగన్…పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. సరిగ్గా పనిచేయకపోతే మొహమాటం లేకుండా సీట్లు ఇవ్వనని చెప్పేశారు. దీంతో కొందరు ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది..తమకు నెక్స్ట్ సీటు వస్తుందా? రాదా అని ఆలోచనలో పడిపోయారు.

ఇదే క్రమంలో నెక్స్ట్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలకు మాత్రం దాదాపు సీట్లు ఖాయమని తెలుస్తోంది. ఎందుకంటే వైసీపీకి రెడ్డి వర్గమే బలం…ఆ పార్టీ అధికారంలోకి రావడానికి రెడ్డి వర్గమే కీలక పాత్ర పోషిస్తుంది…ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతం వైసీపీకి కంచుకోటగా ఉండటంలో రెడ్డి వర్గానిదే ప్రధాన పాత్ర. గత ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి రెడ్డి నేత దాదాపు గెలిచారు. గుంటూరు నుంచి అనంతపురం వరకు చూసుకుంటే…ఉరవకొండలో తప్ప…మిగిలిన అన్నీ నియోజకవర్గాల్లో రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు గెలిచారు. ఇటు తూర్పుగోదావరి జిల్లాలో సైతం ఇద్దరు రెడ్డి ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే.

ఇలా రెడ్డి వర్గం హవా వల్ల వైసీపీకి భారీ మెజారిటీ వచ్చింది…అయితే నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ అధికారం దక్కించుకోవాలంటే రెడ్డి వర్గమే కీలక పాత్ర పోషించాలి. అలాగే వారే గెలుపు వైసీపీ అధికారంలోకి రావడానికి సాయం చేస్తుంది. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు ఇవ్వాల్సిందే. అలాగే పనితీరు బాగా మెరుగ్గా ఉన్నవారిలో రెడ్డి ఎమ్మెల్యేలే టాప్ లో ఉన్నారు.

కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో దాదాపు అందరూ రెడ్డి ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒకరిద్దరు మినహా మిగిలిన వారికి సీట్లు దక్కడం ఖాయమని తెలుస్తోంది. మరి చూడాలి మళ్ళీ రెడ్డి నేతలే వైసీపీని నిలబెడతారేమో.