ఇండస్ట్రీకి రవితేజ పరిచయం చేసిన దర్శకులు వీళ్లే..!!

మాస్ మహారాజా రవితేజ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టాడు. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో స్నేహితుడి పాత్రలో నటించిన ఈయన, ఆ తర్వాత సెకండ్ హీరోగా బ్రహ్మజీతో కలిసి పని సినిమాలలో నటించి మెప్పించాడు. ఇక తర్వాత తన నటనతో, ప్రతిభతో, దర్శక నిర్మాతలను మెప్పించి సోలో హీరోగా పలు చిత్రాలలో నటించి ప్రస్తుతం ఐదు పదుల వయసు దాటినా కూడా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతూ ఉండడంతో ప్రతి ఒక్కరు మాస్ మహారాజా నటనకు ఫిదా అవుతున్నారు. ఇక ఈ క్రమంలోనే కొత్త కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం రవితేజకు ఇదేం కొత్తేం కాదు. ఇక ఈ క్రమంలోని రవితేజ తన సినిమాల ద్వారా ఎంత మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు అనే విషయం ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

శ్రీను వైట్ల:
1999లో రవితేజ నటించిన నీకోసం సినిమా ద్వారా శ్రీను వైట్ల ఇండస్ట్రీకి పరిచయమయ్యారు .ఈ చిత్రానికి అవార్డులు కూడా లభించాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో మళ్లీ వెంకీ ,దుబాయ్ శీను, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు కూడా వచ్చాయి.

అగస్త్య న్:
2003లో ఈ అబ్బాయి చాలా మంచోడు అనే సినిమా ద్వారా దర్శకుడిగా రవితేజ ఇతడిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

యోగి:
2003లో ఒక రాజు ఒక రాణి సినిమాలో హీరోగా రవితేజ నటిస్తుండగా ఈ సినిమా ద్వారా యోగి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత వెంకటేష్ తో చింతకాయల రవి సినిమాను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఎస్ గోపాల్ రెడ్డి:
2004లో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ చిత్రం ద్వారా రవితేజ ఎస్ గోపాల్ రెడ్డి ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఇక ఆ తర్వాత 2005లో భద్రా సినిమాతో బోయపాటి శ్రీను, 2006లో షాక్ సినిమాతో హరీష్ శంకర్ , శంభో శివ శంభో సినిమాతో సముద్రఖని, 2017 డాన్ శీను తో గోపీచంద్ మలినేని.. 2014లో పవర్ సినిమాతో కేఎస్ రవీంద్ర, 2018లో టచ్ చేసి చూడు సినిమాతో విక్రమ్ సిరికొండ , తాజాగా రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతో శరత్ మండవ వంటి దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు రవితేజ.