“థాంక్యూ” ఫస్ట్ డే వరస్ట్ కలెక్షన్స్..డిజాస్టర్ కా బాప్..!!

అక్కినేని వారసుడు నాగ చైతన్య హీరో గా రాశీ ఖన్నా మెయిన్ హీరోయిన్ గా నటించిన సినిమా..” థాంక్యూ”. మనం మూవీ ని తెరకెక్కించిన విక్రమ్ కుమార్ ఈ సినిమా కి కూడా డైరెక్టర్ గా వ్యవహరించారు. అయితే, భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య నిన్న ధియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద భారీ డిజాస్టర్ హా నిలిచింది. రొటీన్ కధ..బోరింగ్ సీన్స్.. పైగా అక్కినేని కుర్రాడి రేంజ్ కి తగ్గ స్టోరీ కాకపోవడంతో సినిమా ను నెగిటీవ్ టాక్ వచ్చింది.

ఎవరో ఒకరో ఇద్దరో తప్పిస్తే..మిగిలిన జనాలు..అంతా కూడా సినిమా పూర్తిగా చూసిన వాడికి థాంక్యూ చెప్పాల్సిందే అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. నిజానికి నాగచైతన్య ఈ సినిమా ప్రమోషన్స్ టైంలో ఓ రేంజ్ లో చెప్పాడు. ఈ సినిమా చూసిన తరువాత మీరు ఇంటికి వెళ్ళి మీకు కావాల్సిన వాళ్ళకు థాంక్యూ చెప్పుతారు. అంత ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది మీకు అంటూ ఆకాశానికి హైప్స్ ఇచ్చాడు . కానీ తెర పై బొమ్మ పడేసరికి..గాలి మొత్తం పోయింది. ఇదేం సినిమా రా బాబు అని చాలా మంది రివ్యూ ఇస్తున్నారు.

సినిమా ఓపెనింగ్ రోజు డప్పుకొట్టుకుంటేనే కలెక్షన్స్ అంతంతమాత్రం గా ఉన్నాయి. మరి అదే నెగిటివ్ టాక్ వస్తే..కలెక్షన్స్ గురించి ఇంక చెప్పనక్కర్లేదు. అదే పరిస్ధితి ఎదురుకుంటుంది..థాంక్యూ సినిమా. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం థాంక్యూ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా డిజాస్టర్ గా నిలిచింది. మొత్తం ఆంధ్ర తెలంగాణ కలిపితే..7 కోట్లు కూడా రాలేదు. ముక్కి మూలిగి..అటు ఇటు గా 6 కోట్ల 40 లక్షలు కలెక్ట్ చేసిన్నట్లు తెలుస్తుంది.

 

ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే దారుణంగా పడిపోయాయి. మొత్తం 8 కోట్ల లోపే ఉంది. నిజానికి నాగ చైతన్య సినిమా స్దాయి కలెక్షన్స్ కావు ఇవి అని అందరికి తెలుసు. దీంతో థాంక్యూని..డిజాస్టర్ కా బాప్..అంటూ ట్రోల్స్ చేస్తున్నారు జనాలు. పాపం, ఓ వైపు సమంత కామెంట్లు..మరో వైపు..ఇలా సినిమా ఫ్లాప్ టాక్..అందులోను డిజాస్టర్ కా బాప్ అంటూ రివ్యూ ఇచ్చేశారు..వీటన్నింటిని అక్కినేని కుర్రాడు ఎలా తట్టుకుంటాడో..?