ఈ డైరెక్టర్స్ స్టార్ హీరోల్నే మించిపోతున్నారు.. రెమ్యునరేషన్ విషయంలో కూడా అస్సలు తగ్గేదేలే!

నేటి ఇండియన్ సినిమా పరిస్థితులు బాగా మారాయి. ఒకప్పుడు వుండే మూసధోరణి ఇప్పుడు లేదు. ప్రేక్షకుడు సినిమా చూసే విధానం బాగా మారింది. అందుకే నేడు మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. ఒకప్పుడు మూసధోరణి అంటే ఏమిటంటే.. కేవలం హీరోని బట్టే సినిమాలు అదే పరిస్థితి ఇపుడు లేదు. కథ, కథనం బాగాలేకపోతే ఇపుడు సినిమాలు ఎవరూ చూడట్లేదు. సినిమా బాగుంటే అది ఎంత చిన్న సినిమా అయినప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇపుడు హీరోని బట్టి కాకుండా డైరెక్టర్ ని బట్టి సినిమాలకు వెళ్లే పరిస్థితి వుంది. అప్పటికీ, ఇప్పటికీ వున్న వ్యత్యాసం అదే.

ప్రస్తుతం ఫామ్ లో వున్న డైరెక్టర్లు వీరే…

ఒకప్పుడు హీరోలు వెంట దర్శకులు పడేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. హీరోలే దర్శకుల వెంట పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నలుగురు దర్శకులు అదే ఫేజ్ లో ఉన్నారు. పాన్ ఇండియా మేకర్లగా ఫేమస్ అయి ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ స్టార్ హీరోల్నే వాళ్ల వెంట తిప్పుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. వారు ఎవరంటే, ‘బాహుబలి’ ప్రాంచైజీతో తో సక్సెస్ అందుకున్న రాజమౌళీ, ‘కేజీఎఫ్’ ప్రాంచైజీతో ఫేమస్ అయిన ప్రశాంత్ నీల్, ‘పుష్ప’ చిత్రంతో హిందీ బెల్ట్ ని షేక్ చేసి సుకుమార్.. అలాగే కోలీవుడ్ యువ కెరటం లోకేష్ కనగరాజ్.

వీళ్లంతా పాన్ ఇండియా వైడ్ మంచి గుర్తింపు దక్కించుకోవడంతో అందరూ వీరి దర్శకత్వంలో చేయాలని కలలు కంటున్నారు. రాజమౌళితో సినిమా చేయాలని టాలీవుడ్ సహా బాలీవుడ్ సైతం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తుంది. బాలీవుడ్ దిగ్గజాలు అయినటువంటి అమీర్ ఖాన్..అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు జక్కన్నతో పనిచేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారంటే అర్ధం చేసుకోవాలి. ఇకపోతే పైన పేర్కొన్న దర్శకులు హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్నారంటే అతిశయోక్తి కాదు. అంతకన్నా ఎక్కువ తీసుకున్నా ఆశ్చర్యపడనవసం లేదు.