ఏపీ అధికార పార్టీ వైసీపీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటికీ.. నాయకులకు ఇప్పటి నుంచే కంటిపై కునుకు లేకుండా పోతోంది. ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో.. ఎవరి కి టికెట్ భాగ్యం దక్కుతుందో.. ఎవరిని పక్కన పెడతారో.. అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే సీఎం జగన్ కొందరికి దీనికి సంబంధించిన హింట్ ఇచ్చేశారు.మీరుసరిగా పనిచేయడం లేదు.. కష్టమే.. మీ పద్దతి మార్చుకోవాలి.. అని సూటిగా చెప్పారు.
“ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. లక్షల కోట్లు పంచుతున్నాం. కానీ, అనుకున్న మైలేజీ రావడం లేదు. మీలో చాలా మంది ప్రజల మధ్య ఉండడం లేదు“ అని సీఎం జగన్ ఇప్పటికి రెండు సార్లు హెచ్చరించారు. ఈ క్రమంలోనే పీకే టీంతో చేయించిన సర్వేను కూడా ఆయన చదివి వినిపించినట్టు తెలుస్తోంది. 150 మంది ఎమ్మెల్యేల్లో.. కేవలం 70 నుంచి 80 మంది మాత్రం ఒకింత తిరుగుతున్నారని.. జగన్ చెప్పుకొచ్చారు. మరో 20 మంది మాత్రమే.. మనసు పెట్టి పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.
మిగిలిన వారంతా.. ఇప్పటికైనా కదలాలని.. ఆయన చెప్పారు. లేకపోతే.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే పరి స్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. చెక్ లిస్టులో ఉన్నవారి ని పరిశీలిస్తే.. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పుష్ప శ్రీవాణి.. మాజీ మంత్రులు.. శంక ర నారాయ ణ.. రంగనాథరాజు.. వంటి వారు కూడా ఉన్నారని వైసీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. వీరి స్థానం లో ప్రత్యామ్నాయంగా కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు.. వైసీపీలో సీనియర్ నాయకులను పక్కన పెట్టి.. వారి స్థానంలో వార సులకు పెద్ద పీట వేయనున్నట్టు సమాచారం. సీనియర్లను కేవలం పార్టీ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం చేయాలని భావిస్తున్నారట. బొత్స సత్యనారాయణ వారసుడు.. సందీప్, రంగనాథరాజు అల్లుడు, పుష్ప శ్రీవాణి కుటుంబంలో శతృచర్ల వర్గం కనుక .. వైసీపీలోకి వస్తానంటే..(వచ్చే అవకాశం లేదు) ఆ కుటుంబానికి జగన్ టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి ఈ జాబితాలో 50 మందికి పైగా ఉన్నారని అంటున్నారు.