మెగాస్టార్ చిరంజివీ..ఈ పేరు కు సినీ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా..సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి..తనదైన స్టైల్ తో అలరించి మెప్పించిన ఈ హీరో..ఇప్పుడు మెగాస్టార్ గా ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. ఈయన ను ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి చాలా మంది కొత్త హీరోలు వచ్చారు. అలాగే ఈయన పేరు వాడుకుని ఇండస్ట్రీలోకి బోలెడు మంది హీరోయిన్స్ వచ్చారు. కానీ, ఒక్క హీరోకి మాత్రం ఈయన ముందే,,నువ్వు ఇండస్ట్రీలో పైకి రాలేవు అంటు చెప్పుకొచ్చారట.
మనకు తెలిసిందే మెగా ఫ్యామిలీలో ఎంతో మంది హీరోలు ఉన్నా..సక్సెస్ అయ్యింది చాలా తక్కువ. మెగాస్టార్ పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి హీరో…స్టార్ హీరో అయిపోలేదు. ఆయన పేరు చెప్పుకుని బ్రతుకుతున్నారు అంతే. అయితే, మెగా స్టార్ కొడుకు రామ్ చరణ్, ఆయన తమ్ముడు కొడుకుగా వరుణ్ తేజ్, ఆయన మేన అల్లుడు గా సాయి ధరమ్ తేజ్ లు ఇండస్ట్రీలోకి వచ్చి ఏదో అర కొర హిట్లు కొట్టారు. కానీ, మెగా మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి..ఒక్కటి అంటే ఒక్క హిట్ కూడా కొట్టలేదు.
కనీసం హీరో అనే గుర్తింపు తెచ్చుకోలేదు. అలాంటి ఈయన కి మెగాస్టార్ ముందే హింట్ ఇచ్చాడట. “బాబు సినీ ఇందస్ట్రీలో అందరు నెట్టుకురాలేరు..దానికి ఓ సపరేటు స్టామినా..టాలెంట్ ఉండాలి..నువ్వు బిజినెస్ లు సినిమాల ప్రోడ్యూసింగ్ వైపు వెళ్లితే బాగుంటుంది అని నా అభిప్రాయం..”అని చెప్పగా..కళ్యాణ్ దేవ్ ఒప్పుకోలేదట. “నాకు సినిమాలు అంటే ఇష్టం అంకుల్..ప్లీజ్ సపోర్ట్ చేయండి అంతూ”పట్టుబట్టారట. చివరికి చిరంజీవి చెప్పిందే జరిగింది. లాస్ట్ ఈ మెగా మాజీ అల్లుడు ఎటుకాకుండా పోయాడు.