బాబు సైలెంట్ స్కెచ్..?

ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే…అప్పుడు ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైన విషయం తెలిసిందే…అటు జగని గాని, ఇటు చంద్రబాబు గాని ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్నారు…నెక్స్ట్ అధికారం దక్కించుకోవడమే జగన్, బాబు టార్గెట్..ఈ క్రమంలోనే ఎక్కడకక్కడ ఎన్నికల్లో లబ్ది పొందడమే లక్ష్యంగా జనాలకు…ఇద్దరు నాయకులు హామీలు గుప్పిస్తున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు…సైలెంట్ గా జనాలకు హామీలు ఇస్తూ…ప్రజలని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే బాబు పలు హామీలు ఇచ్చారు…ఇదే క్రమంలో జిల్లాల విభజన విషయంలో కూడా కొన్ని హామీలు ఇస్తున్నారు. ఈ మధ్యే జగన్ ప్రభుత్వం 13 జిల్లాలని కాస్త 26 జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. అయితే జిల్లాల విభజన విషయంలో కొన్ని ప్రాంతాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు..జిల్లాల విభజన విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలని జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు.

దీన్నే అడ్వాంటేజ్ గా తీసుకుని బాబు…ప్రజలకు హామీలు ఇచ్చేస్తున్నారు. ఈ మధ్య ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు..నగరి నియోజకవర్గానికి చెందిన రెండు మండలాలు తిరుపతిలో కలవగా, మూడు మండలాలు చిత్తూరులో కలిశాయి. అయితే ఆ మూడు మండలాల ప్రజలు..తమని కూడా చిత్తూరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు..ఇప్పటికే మంత్రి రోజాకు పలుమార్లు విన్నవించుకున్నారు. అయినా సరే ప్రయోజనం లేదు…దీంతో చంద్రబాబు..ఆ మూడు మండలాలని కూడా తిరుపతిలో కలుపుతామని హామీ ఇచ్చారు.

అటు పుంగనూరు వచ్చి చిత్తూరు జిల్లాలోకి వచ్చింది..కానీ నియోజకవర్గ ప్రజలు తమని రాయచోటి కేంద్రంగా ఉన్నా అన్నమయ్య జిల్లాలో కలపాలని కోరుతున్నారు. ఇక తాను అధికారంలోకి రాగానే పుంగనూరుని అన్నమయ్య జిల్లాలో కలుపుతానని బాబు హామీ ఇచ్చారు. అలాగే టీడీపీ అధికారంలోకి రాగానే ముంపు మండలాలన్నింటినీ కలపి పోలవరం జిల్లాగా ఏర్పాటు చేస్తా. విలీన మండలాలకు, అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు నడుమ 380 కిలోమీటర్ల దూరం ఉందని, వాటిని ఆ జిల్లాలో కలపడం సరికాదని బాబు చెప్పుకొచ్చారు. ఇలా ఎక్కడకక్కడ జిల్లాల విభజనకు సంబంధించి బాబు..ప్రజలకు హామీలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇలా ఇవ్వడం వల్ల పోలిటికల్ మైలేజ్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.