మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈయన నటిస్తున్న చిత్రాల్లో `భోళా శంకర్` ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చిరంజీవికి సోదరిగా కనిపించబోతోంది.
తమిళంలో అజిత్ నటించిన సూపర్ హిట్ చిత్రం `వేదాళం`కు రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఇటీవల సెట్స్ మీదకు వెళ్లింది. ప్రస్తుతం ప్రత్యేకమైన సెట్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే కోల్‌కతా బ్యాక్ డ్రాప్లో సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అదిరిపోయే ఓ మాస్ మసాలా ఐటెం సాంగ్ ఉండగా.. అందులో హాట్ యాంకర్ రష్మి గౌతమ్ నటించబోతోంది.
ఈ పాటను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయబోతున్నారు. త్వరలోనే ఈ పాట చిత్రీకరణ మొదలు కాబోతుండగా.. ఇప్పుడు ఈ సాంగ్ కోసం రష్మి గౌతమ్ పుచ్చుకుంటున్న రెమ్యూనరేషన్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. వినిపిస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఐదు నిమిషాలు సాగే ఆ ఐటెం సాంగ్ కోసం రష్మి ఏకంగా రూ. 40 లక్షలు రెమ్యునరేషన్‌గా పుచ్చుకుంటుందని తెలుస్తోంది.
ప్రత్యేకమైన సెట్లో మూడు రోజుల పాటు ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ జరగబోతోందని తెలుస్తుండగా.. ఈ పాట సినిమాకే హైలైట్ అవుతుందని అంటున్నారు. కాగా, చిరంజీవి మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య`, మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాదర్` మరియు బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రాలన్నీ కూడా సెట్స్ మీదే ఉన్నాయి.