రామ్ చ‌ర‌ణ్‌కి శంక‌ర్ బిగ్ షాక్‌.. ఆర్సీ 15కి బ్రేక్‌..?!

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` వంటి భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని పూర్తి చేసుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ఆ వెంట‌నే ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 15వ చిత్రాన్ని `ఆర్సీ 15` పేరుతో ప్రారంభించాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

అలాగే అంజ‌లి, సునీల్‌, శ్రీ‌కాంత్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో రామ్ చ‌ర‌ణ్ ప్రభుత్వాధికారి పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ను మహారాష్ట్రలోని పూణే, సతారా, ఫాల్టన్‌లలో చిత్రీక‌రించ‌గా.. త్వ‌ర‌లోనే సెకెండ్ షెడ్యూల్ సైతం ప్రారంభం కానుంది.

అయితే ఇలాంటి త‌రుణంలో డైరెక్ట‌ర్ శంక‌ర్ ఆర్సీ 15ను ప‌క్క‌న పెట్టేసి రామ్ చ‌ర‌ణ్‌కు బిగ్ షాక్ ఇచ్చాడు. అస‌లు ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ప‌లు కార‌ణాల వ‌ల్ల శంక‌ర్‌ ఇండియన్ 2 సినిమాను మొదలుపెట్టి ఆపేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ సినిమాకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం కావడంతో త్వరలోనే సినిమాను తిరిగి పట్టాలెక్కించేందుకు చిత్ర బృందం రెడీ అవుతోంది.

శంక‌ర్‌ మళ్లీ ఇప్పుడు ఇండియన్ 2ను పట్టాలెక్కించడానికి సిద్ధం అయ్యాడు. అందుకు ఏర్పాట్లు అన్నీ జ‌రుగుతున్నాయి. ఈ కార‌ణంగానే ఆర్సీ 15 షూటింగ్‌కి కొన్నాళ్లు బ్రేక్ ప‌డ‌నుంద‌ని.. ఇండియాన్ 2 పూర్తైన వెంట‌నే శంక‌ర్ చ‌ర‌ణ్ మూవీని రీస్టార్ట్ చేయ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.