రాజమౌళి- ఎన్టీఆర్ -చరణ్ ల ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో జక్కన్న వరుస పెట్టి అభిమానులకు సర్ప్రైజ్ లు ఇస్తున్నారు. సినిమా నుంచి రోజూ ఏదో ఒక అప్డేట్ ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారు. నిన్న ఉదయం ఎన్టీఆర్ భీమ్ లుక్, సాయంత్రం అల్లూరి లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఈ మూవీ నుంచి మరో సర్ప్రైజ్ ఇచ్చాడు రాజమౌళి. కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ సీతారామ రాజు పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ కు రాబోయే ట్రైలర్ నుంచి ఆయన నటించిన ఒక సన్నివేశాన్ని కట్ చేసి పంపించారు.
‘బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ రామ్’ అంటూ ఎన్టీఆర్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా చరణ్ కు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ పోస్ట్ చేసిన ఈ ట్రైలర్ టీజ్ లో చరణ్ మంటల్లో నుంచి పోలీస్ గెటప్ లో నడుచుకుంటూ వస్తున్న సన్నివేశం అభిమానులను పిచ్చపిచ్చగా ఆకట్టుకుంటోంది. చరణ్ లుక్ అదిరిపోయింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ టీజ్ ట్రెండింగ్ గా మారింది. అతి త్వరలో ఎన్టీఆర్ ట్రైలర్ టీజ్ చరణ్ రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాల మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ కి సమ ప్రాధాన్యం ఉంటుందని ప్రకటించిన రాజమౌళి ప్రమోషన్ల విషయం లో కూడా ఇద్దరికీ ఒకే రకమైన ప్రాధాన్యం ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. సినిమాలో ఒక హీరోకు సంబంధించిన అప్డేట్ ను మరో హీరోతో ఆవిష్కరింప చేస్తున్నారు.
Brace Yourself for RAM… @AlwaysRamCharan @ssrajamouli #RRRTraileronDec9th #RRRMovie pic.twitter.com/XPUQxmGsey
— Jr NTR (@tarak9999) December 7, 2021