వచ్చే నెల 15 వరకు జగన్ కు టెన్షనే..?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారంటూ సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన జగన్ గతంలో జైలులో కూడా ఉన్నాడు. ఆ తరువాత బెయిలుపై బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీచేసి అనంతరం సీఎం సీటులో కూర్చున్నారు. అయితే ఇపుడు సొంత పార్టీకే చెందిన ఎంపీ రఘురామక్రిష్ణ రాజు కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేశాడు. సీఎం జగన్, ఎంపీ విజయ సాయిరెడ్డి బెయిలు రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించాడు. తన పార్టీ అధినేత బెయిల్ రద్దు చేయాలని ఆయన కోరడం ఆశ్చర్యమేం కాదు.. ఎందుకంటే వైసీపీ ఎంపీ అయినా అధినేతతో పడటం లేదనేది బహిరంగ రహస్యమే.

ఈ పిటీషన్కు సంబంధించి జులైలో జగన్ కేసు, నేటితో విజయసాయి కేసుపై వాదనలు ముగిశాయి. అయితే సీబీఐ కోర్టు మాత్రం తీర్పును వచ్చనెల 15న చెబుతామని ప్రకటించింది. అంతవరకు ఈ ఇద్దరు నేతలకు, వైసీపీ నాయకులు టెన్షన్ పట్టుకుంది. జగన్ తరపు న్యాయవాదులు మాత్రం ఈ పిటీషన్ ను కొట్టి వేయాలని, జగన్ మోహన్ రెడ్డి సాక్షులను ఎటువంటి ప్రభావాలకు గురిచేయడం లేదని వాదించారు. అయితే ఎంపీ రఘురామ లాయర్ మాత్రం గట్టిగానే వాదించారు. ఈ ఇద్దరు నాయకులు తమ అధికార బలంతో బెయిల్ నిబంధనలను తుంగలో తొక్కారని, సాక్షులను ప్రభావితం చేస్తున్నారని వాదించారు. ఓ సమయంలో సీబీఐ కోర్టు తీర్పును వెల్లడిస్తుందేమోనని.. బెయిల్ రద్దవుతుందేమోనని వైసీపీ నాయకులు ఆందోళనకు గురయ్యారు. అటువంటి పరిస్తితే వస్తే సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందేనా అని లీడర్లు చర్చించుకున్నారు. అయితే కోర్టు మాత్రం తీర్పు వాయిదా వేయడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

.