ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న మహేష్ చిన్నారి..!

టాలీవుడ్లోకి ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్ట్ లు గా నటించారు. అయితే వారిలో అవంతిక అనే అమ్మాయి కూడా ఒకరు. ఈ చిన్నారి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ , నాగ చైతన్య వంటి స్టార్ హీరోలతో నటించినది. ఈమె వయసు కేవలం 16 సంవత్సరాలు కావడం విశేషం. అంతేకాకుండా అది చిన్న వయసులోనే ఒక సినిమా తీసి చాలా బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం ఈమె గురించి ఇప్పుడు ప్రపంచమంతా హాట్ టాపిక్ గా మారింది.ఈమె NRI కుటుంబానికి చెందినది. వీరు నివాసముంటున్నది అమెరికాలో. 2005వ సంవత్సరంలో జనవరి 1న కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ జన్మించింది . సినిమా మీద మక్కువతో.. సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. ఇండియాకు చెందిన మంజీర మాకిజానీ దర్శకత్వం వహించిన స్పిన్ మూవీ లో నటించి , ప్రస్తుతం తనను ప్రపంచమంతా పొగిడేలా చేస్తోంది ఈ చిన్నారి. యుక్త వయసులో ఉన్న యువత జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొని చివరికి సక్సెస్ అయ్యారు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో అవంతిక చాలా అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు.

ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ నుంచి డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది. ఇక ఈ సినిమా చూసిన వారంతా ఈ అమ్మాయిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.